ఫ్యామిలీ మొత్తం పెట్రోల్ పోసుకుంటాం.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి బాధితుడి హెచ్చరిక...

డిసెంబర్ 15 లోపు తనకు తన కారు మంజూరు చేయించకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట తన కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుందని విడదల రజినీని హెచ్చరిస్తూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు.

news18-telugu
Updated: December 8, 2019, 10:01 PM IST
ఫ్యామిలీ మొత్తం పెట్రోల్ పోసుకుంటాం.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకి బాధితుడి హెచ్చరిక...
బాధితుడు శామ్యూల్, వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే విడదల రజినికి ఓ వ్యక్తి హెచ్చరిక జారీ చేశాడు. తనకు ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసిన కారును అధికారులు తనకు అప్పగించనివ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, గత ఆరు నెలలుగా తనకు పూట గడవని పరిస్థితి నెలకొందని చెప్పాడు. చిలకలూరి పేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన శామ్యూల్ అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారింది. తాను కాళ్లకు చెప్పులు అరిగిపోయేలా అధికారుల చుట్టూ తిరిగి ఎస్సీ కార్పొరేషన్‌లో స్వయం ఉపాధి కింద కారు మంజూరు చేయించుకున్నానని, అయితే, జూలై 8న అందరికీ కార్లు ఇచ్చే సమయంలో ఎమ్మెల్యే ఫోన్ చేసి తనకు మాత్రం ఆపాలని చెప్పడంతో అధికారులు తనకు కారు ఇవ్వలేదని బాధితుడు చెప్పాడు. ఆరు నెలలుగా ఉపాధి లేకపోవడంతో తన భార్య, ఇద్దరు పిల్లలను వారి పుట్టింట్లో వదిలిపెట్టానని చెప్పాడు. డిసెంబర్ 15 లోపు తనకు తన కారు మంజూరు చేయించకపోతే గుంటూరు కలెక్టరేట్ ఎదుట తన కుటుంబం మొత్తం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుందని విడదల రజినీని హెచ్చరిస్తూ బాధితుడు ఆ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు.First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>