Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...

Daily Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ రోజు ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 5:14 AM IST
Rasi Phalalu : దిన ఫలాలు... ఈ రోజు ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ దిన ఫలాలు తెలుసుకోండి...
రాశి ఫలాలు - మీ రాశి ఫలాలు తెలుసుకోండి.
  • Share this:
తేది: 24-8-2019
మేషరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో స్వల్ప లాభాలు కలుగవచ్చు. చిన్నచిన్న విషయాలలో ఆందోళన చెందుతారు. ప్రయాణాల వలన కొంచెం ఇబ్బందులు పడవచ్చు.

వృషభరాశి వారికి ఈరోజు సహ ఉద్యోగుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలుగవచ్చు. ధనపరంగా చికాకులు కలుగవచ్చు. మానసిక ఆందోళన కలుగవచ్చు.

మిధునరాశి వారికి ఈరోజు చిన్నపాటి మానసిక చికాకులు కలుగవచ్చు. చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు కలుగవచ్చు. వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి.



కర్కాటకరాశి వారికి ఈరోజు శత్రువుల వలన ఇబ్బందులు రావచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు శారీరక మానసిక ఒత్తిళ్ళు కలిగే అవకాశం కలదు. స్వల్పలాభాలు కలుగుతాయి.

సింహరాశివారికి ఈరోజు అనుకున్న పనులు దగ్గరికి వచ్చి ఆగవచ్చు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు శారీరక, మానసిక శ్రమ కలుగవచ్చు.

కన్యారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కలుగవచ్చు. బంధువుల వల్ల శుభవార్తలు వింటారు. ధనపరంగా సామాన్యంగా ఉంటుంది.తులారాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. ఉన్నత వ్యక్తులతో సమావేశం ఉంటుంది. దాని వల్ల లాభం పొందే అవకాశం కలదు. కొద్దిపాటి ఖర్చులు కలుగవచ్చు.

వృశ్చికరాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొద్దిపాటి ఇబ్బందులు కలిగినా అధిగమిస్తారు. వృత్తి వ్యవహారాలలో సంతృప్తికరంగా ఉంటుంది.

ధనస్సురాశి వారికి ఈరోజు లాభదాయకం. వృత్తి, ఉద్యోగాలలో కొత్త ఆలోచనలు చేసే అవకాశం కలదు. కొత్త పరిచయాలు లావాదేవీలు చేసే అవకాశం కలదు.

మకరరాశి వారికి ఈరోజు సంతాన విషయములలో ఇబ్బందులు కలుగవచ్చు. శారీరక శ్రమ తద్వారా మనసు అస్థిరత్వం కలుగవచ్చు. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభరాశి వారికి ఈరోజు బంధువులు, సంతానపరమైన విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. సత్కార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ విషయాలు సామాన్యంగా ఉంటాయి.

మీనరాశి వారికి ఈరోజు కుటుంబపరమైన చికాకులు రావచ్చు. శారీరక, మాననిక ఇబ్బందులు సంతాన విషయంలో ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. వృత్తి, ఉద్యోగాలలో లాభాలు కలుగవచ్చు.
First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు