తిత్లీ తుఫాన్ అప్‌డేట్: శ్రీకాకుళం సెట్ అయ్యాకే వెళ్తా: చంద్రబాబు

హుదుద్ తుఫాన్ వచ్చినప్పుడు సుమారు రూ.60వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రైవేటు సంస్థలు అంచనా వేశాయని చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు మోదీ రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు.

news18-telugu
Updated: October 13, 2018, 12:01 AM IST
తిత్లీ తుఫాన్ అప్‌డేట్: శ్రీకాకుళం సెట్ అయ్యాకే వెళ్తా: చంద్రబాబు
శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్లబోసుకుంటున్న తిత్లీ తుఫాన్ బాధితురాలు
news18-telugu
Updated: October 13, 2018, 12:01 AM IST
తిత్లీ తుఫాన్ ప్రభావం నుంచి శ్రీకాకుళం జిల్లా తేరుకున్న తర్వాతే జిల్లా నుంచి వెళ్తానని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి.. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో వరద నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. సహాయకచర్యల గురించి తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి.. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తిత్లీ తుఫాన్ బాధితులకు తక్షణసాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, లీటర్ నూనె, అరకేజీ పంచదార అత్యవసరంగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

తిత్లీ తుఫాన్ బాధితులకు అందరూ అండగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.

శ్రీకాకుళంలో పర్యటించి వరద సహాయకచర్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళంలో పర్యటించి వరద సహాయకచర్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు


బాగా పనిచేసిన అధికారులకు బహుమతులు ఇస్తామని.. పనిచేయని వారిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో సహాయకచర్యలు చేపడుతున్నా.. అధికారులు అక్కడకు వెళ్లకపోవడంపై విమర్శలు వచ్చాయి. వాటిపై సీఎం చంద్రబాబు స్పందించారు.శ్రీకాకుళం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు


ప్రతి మండలంలో అందరి నుంచి వివరాలు తెప్పిస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. అన్ని గ్రామాల నుంచి సమాచారం తెప్పించి అక్కడ ఏర్పడిన నష్టానికి అనుగుణంగా సహాయకచర్యలు చేపడుతున్నామని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
Loading...
గతంలో హుదుద్ తుఫాన్ వచ్చినప్పుడు సుమారు రూ.60వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రైవేటు సంస్థలు అంచనా వేశాయన్నారు. ప్రభుత్వం అంచనా ప్రకారం రూ.22వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. అయితే, ఆదుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు రూ.650 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు.

శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్లబోసుకుంటున్న తిత్లీ తుఫాన్ బాధితురాలు
శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి తమ గోడు వెళ్లబోసుకుంటున్న తిత్లీ తుఫాన్ బాధితురాలు


శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తానని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రోజులు ఉన్న తర్వాత వెళ్లి మళ్లీ వద్దామని అనుకున్నానని.. జిల్లాలో పరిస్థితిని చూసిన తర్వాత తన మనసు మార్చుకున్నట్టు చెప్పారు.

శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

First published: October 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...