LIVE NOW

Phethai Cyclone Updates: కాకినాడ -తుని మధ్య తీరం దాటే చాన్స్

పెథాయ్ తుఫాన్ వేగం గంటగంటకూ పెరుగుతోంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి గంటకు 28 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.

Telugu.news18.com | December 18, 2018, 12:54 PM IST
facebook Twitter Linkedin
Last Updated December 18, 2018
auto-refresh
పెథాయ్ తుఫాన్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో పెథాయ్ తుఫాన్ ప్రయాణిస్తోంది. తుఫాన్ తీరానికి చేరువ అవుతున్న కొద్దీ తీర ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. కాకినాడ - తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. కాకినాడ వద్ద తీరం దాటితే మాత్రం పెను ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఏడు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా నుంచి విశాఖ వరకు అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు అందరినీ వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

నెల్లూరు జిల్లా మీద పెథాయ్ తుఫాన్ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. సముద్రంలో అలల ఉధృతి కొన‌సాగుతోంది. సముద్రతీర ప్రాంతాలు కోతకు గురయ్యాయి. తీరప్రాంతాల్లో వేగంగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు గ‌జ‌,గ‌జ వ‌ణుకుతున్నారు. జిల్లా అధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు చేపట్టారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నం పోర్టులో త‌మిళ‌నాడు జాల‌ర్ల బోట్లను నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.
Read More
Load More


 ఫెథాయ్ ప్ర‌భావంతో కోస్తా తీర ప్రాంతంలోని వంద కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశం ఉంద‌నే హెచ్చ‌రిక‌లు ఉన్నాయి. దీంతో పంచాయతీ రాజ్ శాఖ 816 జ‌న‌రేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచింది. ఎనిమిది జిల్లాల్లో ఉన్న 80 స‌మ‌గ్ర మంచినీటి ప‌థ‌కాలు విద్యుత్ లేక‌పోయినా న‌డిపించేందుకు 140 జ‌న‌రేట‌ర్లు, 914 ర‌క్షిత నీటిప‌థ‌కాలను నిర్వ‌హించేందుకు 676 జ‌న‌రేట‌ర్ల‌ను సిద్ధం చేశారు. నీటి ప‌థ‌కాలు లేని చోట్లకు తాగునీరు స‌ర‌ఫ‌రా చేసేందుకు 622 ట్యాంక‌ర్ల‌ను అందుబాటులో ఉంచారు. తుఫాన్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌కు ఆర్‌డ‌బ్య్లుఎస్ ప్ర‌త్యేక బృందాల‌ను నియ‌మించింది.
corona virus btn
corona virus btn
Loading