ఏపీ, తెలంగాణకు మరో తుఫాను గండం.. ముంచుకొస్తున్న ‘క్యార్’

సముద్రం అల్లకల్లోల్లంగా ఉంటుందని, అక్టోబర్ 29వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

news18-telugu
Updated: October 28, 2019, 8:30 AM IST
ఏపీ, తెలంగాణకు మరో తుఫాను గండం.. ముంచుకొస్తున్న ‘క్యార్’
ఫొని సైక్లోన్
  • Share this:
తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ గండం పొంచి ఉంది. అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రమైన తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారి ఒమన్ నుంచి భారతదేశం దిశగా పయనిస్తోంది. ఈ తుపానుకు 'క్యార్రా' అని నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైకు దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్.. రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో భీకర రూపం దాల్చనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర, ఉత్తర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. క్యార్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.సముద్రం అల్లకల్లోల్లంగా ఉంటుందని, అక్టోబర్ 29వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని సూచించారు అధికారులు.
First published: October 28, 2019, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading