సూపర్ సైక్లోన్‌గా ‘ఫణి’... దిశ మారితే మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

తుపాను దిశను మార్చుకుంటే, వర్షాలకు బదులు వేడిగాలులు వీస్తాయని, మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు.

news18-telugu
Updated: April 29, 2019, 10:21 AM IST
సూపర్ సైక్లోన్‌గా ‘ఫణి’... దిశ మారితే మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి అలలు ఏడు అడుగుల మేర ఎగసి పడుతున్నాయి. వేగాన్ని మరింత పుంజుకుంటున్న ఫణి తుపాన్.. అదే వేగంతో చెన్నై-మచిలీపట్నం వైపుగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో సముద్రం పది అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో తీర ప్రాంతాలన్నీ పోటెత్తిన సంద్రాన్ని తలపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం మచిలీపట్నానికి 1,090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, గంటకు 20 నుంచి 21 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

తుఫాను వాయువ్య దిశగా కదులుతూ.. తీరం సమీపంలోకి వచ్చిన తర్వాత దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మే 1 నుంచి తుపాను దిశను మార్చుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అది జరిగేంత వరకూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ముప్పు తప్పినట్టుగా భావించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను తీరం దాటే వేళ, గంటకు 195 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని అంటున్నారు. తుపాను దిశను మార్చుకుంటే, వర్షాలకు బదులు వేడిగాలులు వీస్తాయని, మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు.

మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో ఏపీలో అధికారులు అప్రమత్తమయ్యారు. కోస్తా తీరంలో వెంబడి ఉన్న జిల్లా కలెక్టర్లు.. మండలాలవారీగా సమీక్షలు నిర్వహించారు. తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ.. తుఫాన్ ప్రభావాన్ని బట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు