ఉత్తరాంధ్ర దిశగా ‘ఫొని’... మరో ఆరు గంటల్లో తీవ్రతుఫానుగా మారే అవకాశం

మే 1వ తేదీ నాటికి పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో సముద్రం పది అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది.

news18-telugu
Updated: April 29, 2019, 2:17 PM IST
ఉత్తరాంధ్ర దిశగా ‘ఫొని’... మరో ఆరు గంటల్లో తీవ్రతుఫానుగా మారే అవకాశం
ఫొని తుఫాను
  • Share this:
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ ఉత్తరాంధ్ర దిశగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 30, మే 1వ తేదీల్లో తుఫాను దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న ‘ఫొని’ 30న అతి తీవ్రంగా, మే 1న పెను తుపానుగా మారనుంది. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరం సమీపానికి రానుంది. అయితే ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది వాతావరణశాఖ ఇంకా స్పష్టంగా చెప్పలేదు.ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి అలలు ఏడు అడుగుల మేర ఎగసి పడుతున్నాయి. వేగాన్ని మరింత పుంజుకుంటున్న ఫణి తుపాన్.. అదే వేగంతో చెన్నై-మచిలీపట్నం వైపుగా దూసుకొస్తోందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

సోమవారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం తుపాను ట్రింకోమలీకి 620 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 880 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. మే 1వ తేదీ నాటికి పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు తీర ప్రాంతాల్లో సముద్రం పది అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో తీర ప్రాంతాలన్నీ పోటెత్తిన సంద్రాన్ని తలపిస్తున్నాయి.

మే 1 నుంచి తుపాను దిశను మార్చుకోవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అది జరిగేంత వరకూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ముప్పు తప్పినట్టుగా భావించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపాను తీరం దాటే వేళ, గంటకు 195 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని అంటున్నారు. తుపాను దిశను మార్చుకుంటే, వర్షాలకు బదులు వేడిగాలులు వీస్తాయని, మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంటున్నారు.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>