అతి తీవ్ర తుఫానుగా ఫణి... షిప్పులు, హెలికాప్టర్లు సిద్ధం చేసిన నౌకాదళం... ఏపీపై కొంతవరకూ ప్రభావం...

ప్రతీకాత్మక చిత్రం

Cyclone Fani Live Updates : భగ్గున మండుతున్న ఎండల్లో దూసుకొస్తున్న ఫణి తుఫానును ఎదుర్కోవడానికి సర్వం సిద్ధమవుతోంది. బట్... తుఫాను వెళ్లిపోయాక... అత్యంత తీవ్ర ఎండలు తప్పవు.

  • Share this:
Cyclone Fani Live Updates : ఫణి తుఫాను మరింత తీవ్రరూపు దాల్చింది. అందువల్ల దాన్ని అతి తీవ్ర తుఫాను అంటున్నారు. ప్రస్తుతం అది ఒడిషా తీరంవైపు దూసుకెళ్తోంది. ఎమర్జెన్సీలో ఆదుకోవడానికి నౌకాదళం నౌకలనూ, ప్రత్యేక విమానాలనూ, హెలికాఫ్టర్లనూ సిద్ధం చేసింది. అదనపు డైవర్లు, డాక్టర్లు, రబ్బరు బోట్లు, మందులు, దుప్పట్లు, ఆహారం, వస్త్రాలు, సహాయచర్యల్లో అవసరమయ్యే సామగ్రిని నౌకా దళం సిద్ధం చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (విశాఖపట్నం), ఎయిర్ స్టేషన్ల దగ్గర ఎయిర్‌క్రాఫ్ట్స్ (విమానాలు, హెలికాఫ్టర్లు)ని రెడీ చేసింది. ఎవర్నైనా ఉన్నపళంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే... సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది నేవీ. అసలే తుఫాన్లు వస్తే చిగురుటాకులా వణికిపోయే ఒడిషా... ఇప్పుడు మరోసారి ఆందోళన చెందుతోంది. ఆ రాష్ట్రంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్... సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రిపేర్ అయ్యింది. తీర ప్రాంతం దగ్గర ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కూడా సిద్ధంగా ఉన్నారు.

విశాఖపట్నంలో INS డేగా రెడీగా ఉంది. అందులో వేగంగా తుఫాను బాధితుల్ని తరలించవచ్చని నేవీ తెలిపింది. ఒడిషాలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ఉంది. ప్రస్తుతం అక్కడ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే ప్రమాదం కనిపిస్తోంది. ఒడిషాలోని చాలా చోట్ల వరదలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం తుఫాను ఒడిషా వైపు వస్తున్నా... బుధవారం అది మరింత అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫానుగా మారి... రూట్ మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అది వేగంగా వెళ్తూనే ఈశాన్యం వైపు టర్న్ తీసుకుంటుందనీ... బంగ్లాదేశ్ వైపు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. వాతావరణంలో తేడా వస్తే... అది తిన్నగా వచ్చి ఒడిషాపై విరుచుకుపడినా పడవచ్చు. ఏపీ, ఒడిషాలో జాలర్లు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే చాలాసార్లు మూడ్రోజులుగా అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. రేపటి కల్లా ఒక్క జాలరి కూడా సముద్రంలో ఉండటానికి వీల్లేదని ఒడిశా ప్రభుత్వం కోరింది.


ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం : కేంద్ర ప్రభుత్వం ఈ తుఫానుపై ఓ కన్నేసి ఉంచింది. ఎప్పటికప్పుడు వాతావరణ అధికారుల ద్వారా రిపోర్టులు తెప్పించుకొని విషయం తెలుసుకుంటోంది. ప్రస్తుతం తుఫాను మచిలీపట్నానికి 700 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశ నుంచీ వాయువ్య దిశవైపు వస్తోంది. అంటే ఏపీ, ఒడిషాకు దగ్గరగా వస్తోందన్న మాట. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నా... వాళ్ల మాటల్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే... అది తుఫాను. ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే ఏపీ ప్రభుత్వం, అధికారులు రెడీగా ఉన్నారు. ఇంతకు ముందు హుద్ హుద్, తిత్లీ తుఫానును ఎలా ఎదుర్కొన్నారో, అదే విధంగా ఫణి సంగతి కూడా తేల్చుకోవడానికి రెడీగా ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ట్రాలూ ఇప్పుడు తుఫానుపై అప్రమత్తంగా ఉన్నాయి.

 

ఇవి కూడా చదవండి :

ముగ్గురు యువతుల్ని చంపేశాడు... హాజీపూర్‌లో ఉద్రిక్తత... నిందితుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి...

వీవీప్యాట్ స్లిప్పులను ఇలా లెక్కించాలి... రూల్స్ ఏంటో చెప్పిన ఈసీ...

టీడీపీకి షాక్... వైసీపీ ఖాతాలోకి గోదావరి జిల్లాలు... కొత్త సర్వేలో ఆసక్తికర అంశాలు...

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...
First published: