తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోసావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం...

Fani Cyclone : ఎల్లుండికి ఫణి తుఫాను... మరింత బలపడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ వైపు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. నిజాంపట్నంలో రెండో నంబర్ హెచ్చరిక జారీ చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 28, 2019, 9:28 AM IST
తీవ్ర తుపానుగా ఫణి... 30న దక్షిణ కోసావైపు రాక... అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓవైపు దక్షిణాదిన ఎండలు తీవ్రంగా ఉంటే... అదే సమయంలో బంగాళాఖాతంలో పుట్టిన తుఫాను వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఆ తుఫాను శనివారం ఉదయం మరింత బలపడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం దానికి ఫణి అనే పేరు సూచించడంతో... అది బాగానే ఉండటంతో అధికారులు ఆ పేరునే ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఫణి తుఫాను... చెన్నైకి ఆగ్నేయంగా దాదాపు 1,050 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 29 కల్లా అతి తీవ్ర తుఫానుగా మారబోతోందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఫణి ఓ మూడ్రోజులు శ్రీలంక తీరం వెంట వాయువ్య దిశగా వెళ్లి... 30న సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు వస్తుందనే అంచనా ఉంది.

దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రంపై వేడి 31డిగ్రీల దాకా ఉంది. ఫలితంగా నీరు ఆవిరై పైకి వెళ్తోంది. అది తుఫాను బలపడేందుకు కారణమవుతోంది. 30 సాయంత్రానికి ఫణి తుఫాను దిశ మార్చుకుని ఈశాన్యంగా వెళ్తుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. సాధారణంగా ఏప్రిల్‌, మేలో బంగాళాఖాతంలో వచ్చే తుఫాన్లు దిశ మార్చుకుని బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వైపు వెళ్తుంటాయి. ఇది కూడా అటే వెళ్తుందనే అంచనా ఉంది. బంగ్లాదేస్ దగ్గర తీరం దాటే అవకాశాలున్నాయని లెక్కలు వేస్తున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్‌కి అలర్ట్ : ఎండాకాలంలో వచ్చిన ఫణి తుఫాను వల్ల ఏప్రిల్ 30, మే 1న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాల్లో భారీవర్షాలు కురిసేలా ఉన్నాయి. ఒకవేళ అది దిశ మార్చుకొని తీరానికి దూరంగా వెళ్తే మాత్రం చిన్నపాటి వర్షాలే కురుస్తాయి. కానీ 29, 30, 1 తేదీల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. భారీ అలలు వస్తాయి. ఓ నాల్రోజులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆల్రెడీ వెళ్లిన వాళ్లు... వీలైనంత త్వరగా వచ్చేయాలని కోరింది. కృష్ణ పట్నం పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్‌లో శనివారం రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను వెళ్లిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎండ వేడి మరింత పెరగనుంది. ముఖ్యంగా అతి వేడి గాలులు వీస్తాయంటున్నారు. వడ దెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్‌పై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండదనీ, కానీ... ఈ తుఫాను ఎర్పడటం వల్ల ఏపీకి సకాలంలో పడాల్సిన వర్షాలు కూడా మరింత ఆలస్యం అయ్యే పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు. గతంలో కూడా ఏపీకి మేలో కొన్ని తుఫాన్లు వచ్చాయి. వాటి వల్ల ఏపీకి నష్టమే జరిగింది కానీ లాభం లేదు. తుఫాను దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ, నేవీలను సహాయక చర్యల కోసం సిద్ధం చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం అయ్యారు. తుఫాను ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందనేది ఇవాళ స్పష్టత రానుంది.

 

ఇవి కూడా చదవండి :

అహింసా మీట్.. ఇక ల్యాబ్‌లో మాంసం తయారీ... కోళ్లు, మేకలతో పనిలేదు... టేస్ట్ ఎలా ఉంటుందంటే...

ఏపీలో పెరిగిన పోలింగ్ వైసీపీకి కలిసొస్తుందా... టీడీపీకి మేలు చేస్తుందా...

మే 26న జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేస్తారా... ఆ రోజే మంచిదంటున్న జ్యోతిష్యులు... ఎందుకంటే...

వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమే
First published: April 28, 2019, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading