Home /News /andhra-pradesh /

Cyclone Jawad: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్

Cyclone Jawad: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. తీర ప్రాంతాల్లో హై అలర్ట్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Cyclone Jawad Effect: ఆంధ్రప్రదేశ్ పై అల్పపీడనాలు.. తుఫాన్లు విరుచుకుపడుతున్నాయి. మొన్నటి వరకు రాయలసీమన వణికింది.. ఇప్పుడు ఉత్రరాంధ్ర భయపడుతోంది.. జవాద్ తుఫాను కారణంగా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  cyclone Jawad Effect on Uttarandhra: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై వరుణుడు పగబట్టాడా అనే రేంజ్ లో వానలు ముంచెత్తుతున్నాయి. మొన్న పడ్డ భారీ వర్షాల నుంచి రాయలసీమ ఇంకా తేరుకోలేదు.. ఇప్పుడు జవాద్ తుఫాను ఉత్తరాంధ్ర (Uttarandhra)పై పెను ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రాలో పలు చోట్ వర్షాలు పడుతున్నాయి. రాత్రికి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జవాద్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుండడంతో తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 100 కిలో మీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. తుపాను (Cyclone) నేపథ్యంలో ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు పూర్తిగా సన్నద్ధమై ఉన్నారు. ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి సన్నదతో రంగంలోకి దిగి ఉన్నాయి.

  ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన సంగతి తెలిసిందే. ఇవాళ అర్థరాత్రి భారీ వర్షాలకు అవకాశం ఉంది. అలాగే శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి తుపాను పయనించనుంది. తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అనంతరం పూరీ మీదుగా వెస్ట్‌బెంగాల్‌ వైపు జవాద్‌ పయనించనుంది. ప్రస్తుతం విశాఖ (Visakha)కు 420 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 530 కిలోమీటర్లు.. పారాదీప్‌కు 630 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయింది. తీరం దాటకుండానే వెస్ట్‌బెంగాల్‌ వైపు తుపాను పయనించనుంది. తుపాను ప్రభావంతో కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  ఇదీ చదవండి : లోకేష్ ను చంద్రబాబే ఓడించారా..? ఆ పదవికి అడ్డుపడతారని భావించారా..? మంత్రి సంచలన వ్యాఖ్యలు

  జవాద్‌ తుపాను ముప్పుపై విజయనగరం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం చూపే ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అలర్ట్‌ చేసింది. చేపట్టాల్సిన సహాయ, పునరావాస చర్యలపై ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే.. అధికారులతో సమీక్షించారు. తుపాను తీవ్రమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  ఇదీ చదవండి : అది నిజమని నిరూపిస్తే బొత్స రాజీనామ చేస్తారా..? రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గోరంట్ల విమర్శ

  మరోవైపు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) విద్యుత్‌ వినియోగదారులకు అప్రమత్తం చేసింది. జవాద్ తుఫాను కారణంగా ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్నికంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేయాలని పేర్కొంది. తుపాను ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ఏఎండీ కె.సంతోషరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  ఇదీ చదవండి : ఆ మంత్రికి అధికారులు అవసరం లేదా..? అసలు వారితో సమస్య ఏంటి?

  విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు- 9440816373 / 8331018762
  శ్రీకాకుళం- 9490612633
  విజయనగరం-9490610102
  విశాఖపట్నం-7382299975
  తూర్పుగోదావరి-7382299960
  పశ్చిమగోదావరి-9440902926

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Cyclone Jawad, Heavy Rains

  తదుపరి వార్తలు