హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Cyclone Jawad: ఏపీని వెంటాడుతున్న ముప్పు.. దూసుకొస్తున్న జవాద్‌.. 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు

Cyclone Jawad: ఏపీని వెంటాడుతున్న ముప్పు.. దూసుకొస్తున్న జవాద్‌.. 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Jawad Cyclone Effect: ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు కరుణ చూపించడం లేదు. శీతాకాలంలో వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఏపీలో ఐదు జిల్లాలుపైగా భారీ వానలకు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడు జవాద్ ముప్పు దూసుకొస్తోంది.. ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే..?

ఇంకా చదవండి ...

P. Anand Mohan, Visakhapatnam, News18                       Jawad Cyclone Effect on Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను భారీ వర్షాలు (Heavy Rains) కుదిపేస్తున్నాయి. కుండపోత వానలు.. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరదలతో రాయలసీమ, కోస్తాఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధం నుంచి బయట పడలేదు. ఇప్పుడు మరో డేంజర్ బెల్ మోగింది. ఇది మరింత ప్రమాదం కరం అంటున్నారు వాతావరణ నిపుణులు. తాజాగా జవాద్‌ తుఫాన్‌ (Jawan Cyclone) ముప్పు వణికిస్తోంది. అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద ఏర్పడిన అల్పపీడనం మరి కొన్ని గంటల్లో తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఒడిషా (Odisha), ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.  దక్షిణ థాయ్‌లాండ్‌ సముద్రంలో  అల్పపీడనం ఏర్పడింది. ఇది 2న వాయుగుండంగా మారనుంది. పశ్చిమ, ఉత్తరపశ్చిమ దిశగా కదలనున్న ఈ విపత్తు 3వ తేదీన అంటే శుక్రవారం తూర్పు కేంద్ర బంగాళాఖాతానికి చేరువై తుపానుగా మారనుంది.

అయితే గత కొన్నేళ్లుగా ఎప్పుడూ నవంబరు చివరిలో, డిసెంబరు ప్రథమార్థంలో  తుపానులు సంభవించిన దాఖలాలు లేవు. అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. శీతాకాలం వానకాలంలా మారింది. గజగజా వణికించే చలి బదులు భారీ వర్షాలు భయపెడుతున్నాయి. అయితే ఇప్పటికే రాయలసీమ జిల్లాలు అతాలాకుతలం అయ్యాయి. మొన్న కురిసిన వర్షాల నుంచి ఆ జిల్లాలు ఇంకా తేరుకోలేదు. ఇలాంటి సమయంలో  మరో విపత్తు ముంచుకొస్తోందనే హెచ్చరికలు భయపడేలా  చేస్తున్నాయి.

ఇదీ చదవండి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?

ఈ నెల 4వ తేదీ అంటే శనివారం ఉదయం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒరిస్సా తీరానికి తుపాను చేరువవుతుంది. తీరానికి చేరువైనా భూమ్మీదకు రాకుండా ఉత్తర, తూర్పు దిశగా (ఒడిషా తీరం మీదుగా) పశ్చిమ్‌ బెంగాల్ కు చేరుకునే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇదీ చదవండి: ఏపీ దిశ బిల్లుపై కొర్రీలు పెడుతోందా..? కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?

ఈ తుపాను తీరాన్ని దాటకపోయినా *ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై  మొదట ప్రభావం చూపించనుంది. ఆ తర్వాత ఉత్తర కోస్తా ఒడిషా ప్రాంతాల్లో తీవ్ర నష్టాలు కలిగించే అవకాశం ఉంది. ఆ జిల్లాల్లో 200 మి.మీ. వర్షపాతం. పడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దూకుడు.. అధికార పార్టీకి వరుస షాక్ లు

ఏపీలో నేటి వాతావరణం  పొడిగా ఉన్నా.. శుక్రవారం నంచి భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది.  3న గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్‌పూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశారు. 4న గజపతి, గంజాం, పూరీ, ఖుర్దా, నయాగఢ్, జగత్సింగ్‌పూర్, కేంద్రపడ, కటక్, భద్రక్, బాలేశ్వర్, జాజ్‌పూర్‌లలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు చేశారు.

ఇదీ చదవండి: సీఎం అవ్వాలన్న ఆశ.. ఆకాంక్ష రెండూ ఉన్నాయి.. టీడీపీతోనే అనుబంధం.. ఆయన మనసులో మాట ఇదే

తాజా పరిస్థుల నేపథ్యంలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని నేడు తీర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. రేపు తీవ్రత 70 కి.మీ. నుంచి 80 కి.మీ.కి పెరుగుతుంది. 4న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. తిట్టుకున్నారు.. తొడలుకొట్టుకున్నారు.. ఇప్పుడు చేయి చేయి కలిపారు

సముద్ర కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, 2వ తేదీ నుంచి 5 వరకు మత్స్యకారుల చేపల వేటను నిషేధిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 5 వరకు తుపాను ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పంటలు, పూరిళ్లు దెబ్బతినే అవకాశం ఉందని, గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకూలే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Heavy Rains, Odisha

ఉత్తమ కథలు