ఉత్తర శ్రీలంకపై కొనసాగుతున్న 'బురేవి' తుఫాన్ గడచిన ఆరు గంటలలో 11 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, ఈరోజు ఉదయం 08:30 గంటలకు ఉత్తర శ్రీలంక, దానిని ఆనుకుని ఉన్న మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో సుమారుగా Latitude 9.1°N, Longitude 80.2°E వద్ద మన్నార్ కు తూర్పు ఈశాన్యంగా 30 కిలోమీటర్లు, పాంబన్‌కు తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, కన్యాకుమారికి తూర్పు ఈశాన్యంగా 310 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 3 గంటలలో ఇది పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణించి, మన్నార్ గల్ఫ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి తుఫాన్ పాంబన్‌కు చాలా దగ్గరగా 70-80 కిలోమీటర్లు, అత్యధికంగా 90 కిలోమీటర్ల వేగంతో గాలుల కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం తరువాత ఇది పాంబన్ ప్రాంతం మీదుగా పశ్చిమనైరుతి దిశగా ప్రయాణించి, ఈరోజు రాత్రికి లేక రేపు (డిసెంబర్ 4) తెల్లవారుజామున దక్షిణ తమిళనాడు తీరంలో దాదాపు పాంబన్, కన్యాకుమారిల మధ్య 70-80 కి.మీ, అత్యధికంగా 90 కి.మీ గాలుల వేగంతో తీరందాటే అవకాశం ఉంది. మరోవైపు మాలే ద్వీపకల్పం ప్రాంతంలో ఈరోజు ఉపరితల ఆవర్తనం 5.8 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది.
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Cyclone, Cyclone alert, WEATHER