తీరం దాటిన బుల్ బుల్ తుఫాను... అల్లకల్లోలంగా సముద్రం

ఏపీలో అక్కడక్కడా... ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: November 10, 2019, 12:56 PM IST
తీరం దాటిన బుల్ బుల్ తుఫాను... అల్లకల్లోలంగా సముద్రం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 10, 2019, 12:56 PM IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుపాను అర్థరాత్రి తీరం దాటింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుపాను గత రాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇక, తుపాను ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఏపీలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...