CYCLONE BULBUL BREWING IN THE BAY OF BENGAL WILL HIT ANDHRA PRADESH AND ODISHA BY NOVEMBER 9 BS
ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో బుల్ బుల్..
బంగాళాఖాతంలో తుఫాను
Cyclone Bulbul : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబరు 9 నాటికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వరుస భారీ వర్షాలతో దేశం మొత్తం ప్రభావితమవుతోంది. గత రికార్డులన్నీ చెరిపేస్తూ ఈ సారి వరుసగా తుఫాన్లు వస్తున్నాయి. తాజాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, నవంబరు 9 నాటికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అండమాన్ దీవులకు పశ్చిమ వాయవ్య దిశగా 390 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ఫలితంగా శుక్రవారం సాయంత్రం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆ తుఫానుకు బుల్ బుల్ అని పేరు పెట్టారు. బుల్ బుల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణలోనూ అక్కడక్కడా మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా, వర్షాలు పడి వరదల ప్రభావంతో ఇప్పటికే ఇసుక కొరత ఏర్పడగా.. తుఫాను ప్రభావంతో కష్టాలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతున్న తరుణంలో ఈ తుఫాను మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.