CYCLONE ASANI RECURVES AND MOVING TOWARDS VISAKHAPATNAM FROM MACHILIPATNAM WATCH CYCLONE MOVEMENT LIVE HERE SK
Cyclone Asani: ప్రస్తుతం అసని తుఫాన్ ఎక్కడుంది? విశాఖకు కూడా ముప్పుందా? లైవ్‌లో వీక్షించండి
ప్రతీకాత్మక చిత్రం
Cyclone Asani: ఇప్పటికే ఈ తుఫాన్ ఏపీ తీరాన్ని తాకి దిశను మార్చుకున్నట్లుగా 'ఏపీ వెదర్ మ్యాన్' వెల్లడించారు. ఏపీ భూభాగాన్ని తాకిన తర్వాత దిశను మార్చుకొని.. ఈశాన్య దిశలో ముందుకు కదులుతుందని తెలిపారు.
ఏపీలో అసని తుఫాన్ (Cyclone Asani) అలజడి రేపుతోంది. ఈ తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తూర్పు తీరంలో అల్లకల్లోలం నెలకొంది. బంగాళాఖాతం (Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర తుఫాన్.. ప్రస్తుతం తుఫాన్‌గా బలహీనపడిందని భారత వాతావరణ (IMD) విభాగం తెలిపింది. ఐంఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. అర్ధరాత్రి 02.30 గంటల సమయంలో అసని తుఫాన్ ఏపీలోని మచిలీపట్నానికి దక్షిణ-ఆగ్నేయ దిశగా 60 కి.మీ దూరంలో, కాకినాడకు దక్షిణ-నైరుతి దిశలో 180 కి.మీ దూరంలో, విశాఖపట్టణానికి 550 కి.మీ. దూరంలో ఉంది. మచిలీ పట్నం సమీపంలో తీరాన్ని తాకిన తర్వాత.. అనూహ్యంగా దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం మచిలీపట్నం, నర్సాపూర్, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్టణం మీదుగా ముందుకు కదులుతుందని పేర్కొంది. ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా ముందుకు కదిలి.. ఇవాళ సాయంత్రం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. బుధవారం ఉదయం నాటికి వాయుగుండం బలహీనపడుతుందని పేర్కొంది.
The Severe Cyclonic Storm ‘Asani’ over westcentral Bay of Bengal moved west-northwestwards with a speed of 12 kmph during the past 6 hours, weakened into a Cyclonic Storm: India Meteorological Department pic.twitter.com/gsMaf13VCd
ఐతే ఇప్పటికే ఈ తుఫాన్ ఏపీ తీరాన్ని తాకి దిశను మార్చుకున్నట్లుగా 'ఏపీ వెదర్ మ్యాన్' వెల్లడించారు. ఏపీ భూభాగాన్ని తాకిన తర్వాత దిశను మార్చుకొని.. ఈశాన్య దిశలో ముందుకు కదులుతుందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే గుంటూరు, పల్నాడు, బాపట్ల, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మరి ప్రస్తుతం అసని తుఫాన్ ఎక్కడుందో.. ఇక్కడ లైవ్‌లో చూడండి.
తుఫాన్ నేపథ్యంలో ఏపీ అధికారులు అప్రమత్తమై.. కోస్తా జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బీచ్‌ల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ్టి సాయంత్రం వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.