Home /News /andhra-pradesh /

Cyclone Amphan | అల్లకల్లోలంగా మారిన ఆంధ్రా సముద్ర తీరం..

Cyclone Amphan | అల్లకల్లోలంగా మారిన ఆంధ్రా సముద్ర తీరం..

అల్లకల్లోలంగా మారిన ఎంఫాన్ తుఫాను

అల్లకల్లోలంగా మారిన ఎంఫాన్ తుఫాను

Cyclone Amphan : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉమ్‌ పున్ తుఫాను కారణంగా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఉప్పాడ సముద్ర తీరం అల్ల కల్లోలంగా మారింది.

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఉమ్‌ పున్ తుఫాను కారణంగా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఉప్పాడ సముద్ర తీరం అల్ల కల్లోలంగా మారింది. రంగంపేట నుంచి ఎస్పీ జీఎల్ శివారు వరకు సముద్ర అలలు పోటెత్తుతున్నాయి. సముద్రపు అలలు వాహనదారులపై విరుచుకుపడుతున్నాయి. దీంతో కాకినాడ ఉప్పాడ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు. నీటి మట్టం పెరగడం, వాతావరణంలో మార్పు రావడంతో సముద్ర అలలు మరింత పెరిగే అవకాశాలు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. అటు.. సముద్రం పక్కన ఉన్న బోట్లు, వలలు భద్రపరచుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు.

    కాగా, ఎంఫాన్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని, సూపర్ సైక్లోన్‌గా మారే ప్రమాదం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిసాపై తీవ్ర ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Cyclone, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు