హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో సీపీ సజ్జనార్... సెల్ఫీలకు క్యూ కట్టిన యూత్

ఏపీలో సీపీ సజ్జనార్... సెల్ఫీలకు క్యూ కట్టిన యూత్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్

కర్ణాటకకు చెందిన సజ్జనార్ కుటుంబానికి వీరభద్రస్వామి ఇలవేల్పు. వీరభద్రునికి, దుర్గాదేవికి సజ్జనార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. అనంతపురం జిల్లా లేపాక్షిని సందర్శించిన వేళ, యువతీ యువకులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇటీవల దిశ హత్యాచారం తరువాత, 10 రోజుల వ్యవధిలో దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ జరగడంతో సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.  ఇక లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయానికి సంప్రదాయ పంచెకట్ట, లాల్జీ ధరించి, కుటుంబీకులతో కలిసి సజ్జనార్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికారు. కర్ణాటకకు చెందిన సజ్జనార్ కుటుంబానికి వీరభద్రస్వామి ఇలవేల్పు. వీరభద్రునికి, దుర్గాదేవికి సజ్జనార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం బయట తనకోసం వేచి చూస్తున్న యువతను ఆయన పలకరించారు.  దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు క్యూ కట్టారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Disha murder case, Hyderabad, Sajjanar, Shadnagar encounter

ఉత్తమ కథలు