కొబ్బరి రైతులకు శుభవార్త... వినాయక చవితి వేళ వరాల జల్లు

కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియలో ఒక హెక్టారు (2.5 ఎకరాలు)కు మూడేళ్లలో రూ.2,79,770 ఉపాధి హామీ పథకం కింద ఇస్తారు.

news18-telugu
Updated: September 2, 2019, 5:11 PM IST
కొబ్బరి రైతులకు శుభవార్త... వినాయక చవితి వేళ వరాల జల్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొబ్బరి రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వినాయక చవితి వేళ వరాల జల్లు కురిపించింది. కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి, రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది ఏపీ సర్కార్. దీని కింద ఒక్కో హెక్టారు తోటకు మూడేళ్లలో దాదాపు రూ.2.80 లక్షల సహాయం అందుతుందని ఏపీ వ్యవయసాయమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. బీమా ప్రీమియమ్‌లో కూడా కొబ్బరి రైతులకు 75 శాతం రాయితీ లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని, రైతు క్షేత్రంలోనే పరిశోధనలు జరుపుతామని తెలిపారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం కొబ్బరి పంటకు కూడా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతాల్లో కొబ్బరి తోటల సాగు ఎక్కువ. చెట్లకు తెగులు సోకడం వల్ల దిగుబడి పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొబ్బరి బోర్డు అనుసంధానంతో రీ ప్లాంటింగ్-రీజనరేషన్ అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
కన్నబాబు


కొబ్బరి రైతులపై వరాలు:

పాడైన చోట పాత చెట్లు తొలగించి, కొత్తగా మొక్కలు నాటి పెంచడం . అదే విధంగా తెగుళ్లు వంటి వాటిని నివారించి, ఆ మొక్కలు తిరిగి పెంచడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పథకం ప్రవేశపెడుతుంది.కొబ్బరి తోటల సాగును ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తారు. ఈ ప్రక్రియలో ఒక హెక్టారు (2.5 ఎకరాలు)కు మూడేళ్లలో రూ.2,79,770 ఉపాధి హామీ పథకం కింద ఇస్తారు.

అందులో కూలీ చెల్లింపు కింద 822 పని దినాలకు రూ.1,73,591 అందిస్తారు. మెటేరియల్‌ కాంపోనెంట్‌ కింద మరో రూ.1,06,179 చెల్లిస్తారు. అంటే తొలి ఏడాది దాదాపు రూ.1.08 లక్షలు, రెండో ఏడాది రూ.85 వేలు, మూడో ఏడాది రూ.52 వేలు అందిస్తారు.

కొబ్బరి తోటలకు వైయస్సార్‌ ఉచిత పంటల బీమా కింద బీమా కూడా చేయూతనిస్తారు. కొబ్బరి పంటల బీమా ప్రీమియమ్‌లో 75 శాతం మొత్తాన్ని కొబ్బరి బోర్డుతో కలిసి ప్రభుత్వం చెల్లిస్తుంది. 4 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు ఉండే మొక్కలకు రూ.9, 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న మొక్కకు రూ.14 చొప్పున ప్రీమియమ్‌ చెల్లించాలి. ఇందులో 75 శాతం మొత్తాన్ని ప్రభుత్వంతో పాటు, కొబ్బరి బోర్డు భరిస్తుంది.గతంలో మాదిరిగా గట్ల మీద కొబ్బరి మొక్కలు నాటేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతారు. ఈ ప్రక్రియలో రైతులకు తగిన ప్రోత్సాహం అందిస్తారు.

కొబ్బరికి మరింత చేయూతనిచ్చే విధంగా సెంట్రల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీపీసీఆర్‌ఐ) ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. సామర్లకోటలో ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదించారు. ఆ దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు.

రైతు క్షేత్రంలోనే శాస్త్రవేత్తలు రీసెర్చ్‌ చేపడతారని, త్వరలోనే ఈ విధానం కూడా అమలు చేయబోతున్నామని మంత్రి కన్నబాబు వివరించారు.
First published: September 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు