Anna Raghu, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం క్రాప్ హాలిడే (Crop Holiday). సాగునీటి లభ్యత, విద్యుత్ కొరత, ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో అక్కడక్కడా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అదే అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుండగా.. ప్రభుత్వం మాత్రం క్రాప్ హాలీడే అంతా ఓ పొలిటికల్ డ్రామా అంటూ కొట్టిపారేస్తోంది. తాజాగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం పంటకి గిట్టుబాటు ధర లేదని గోవాడ గ్రామం మొత్తం క్రాప్ హాలిడే తీసుకున్నట్టుగా రైతులు ప్రకటించారు. ప్రతి ఇంటికి తిరిగి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎరువుల ధరలు పెరిగాయి. కూలీలు రేట్లు పెరిగాయి కౌలు ధరలు పెరిగాయి అయితే ధాన్యం రేటు మాత్రం పెరగలేదు.
ఇప్పుడున్న రేట్లతో కనుక వ్యవసాయం చేస్తే అప్పులు తప్ప ఏమీ మిగలదు అని దానికన్నా వ్యవసాయం చేయకుండా ఉండటమే మేలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించి నట్లయితే వ్యవసాయం చేయడానికి వీలుగా ఉంటుందని గిట్టుబాటు ధర కనీసం 75 కేజీల కి 2000 రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వని పక్షంలో వ్యవసాయం చేయలేమని గ్రామం మొత్తం రైతులు తీర్మానం చేసుకున్నారు.
డీఏపీ ధర 1400 అయింది ఆధర వాళ్ళు నిర్ణయించారు మేము గిట్టుబాటు ధర 1800 రైతు డిసైడ్ చేయలేడు కదా కాలువలు శుభ్రం చేయలేదు పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగాయి కొద్దిపాటి వర్షానికి పోలాలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం చేయాలనుకున్న యువతకు పిల్లనిచ్చి పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు.
వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. వంద రూపాయలు ఖర్చు పెడితే 70 రూపాయలు మాత్రమే వస్తున్నాయి.ఇంత నష్టం పోతు వ్యవసాయం చేయడం కన్నా ఇంట్లో కూర్చోవడం మేలని గోవాడ గ్రామ రైతులు భావిస్తూ గ్రామంలోని 2800 ఎకరాలలో క్రాప్ హాలిడే తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల కోనసీమ (Konaseema)లోని ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలిడేను అధికారికంగా ప్రకటించారు కూడా. తాజాగా జిల్లాలోని 12 మండలాల్లోనూ క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోవడం లేదని, దిక్కుతోచని స్థితిలోనే క్రాప్ హాలిడే పాటిస్తున్నామని రైతులు అంటున్నారు. ఈ సందర్భంగా పలు రైతు సమస్యల్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదు. ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Farmers Protest, Guntur