GT Hemanth Kumar, Tirupathi, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రముఖ శైవక్షేత్రాల్లో చిత్తూరు జిల్లా (Chittoor District) శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఒకటి. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆలయానికి పోటత్తారు. శివరాత్రి నాడు శివయ్యను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి సకల సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ పంచభూతాల్లో ఒకటైన వాయు లింగమై వెలిసాడు భక్త కన్నప్ప ఆరాధించిన పరమేశ్వరుడు. అందుకే శ్రీకాళహస్తికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామి., అమ్మవార్ల అనుగ్రహం పొందుతారు. జ్ఞానప్రసనాంబ సమేత వాయులింగేశ్వర దర్శనం నవగ్రహాల వక్ర చూపు నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెపుతున్నారు. దూర ప్రాంతాలనుంచి ఆలయానికి భక్తులకు ఏర్పాట్లు మాత్రం సూన్యంగా కనిపిస్తోంది. ఆలయంలో చుక్క నీరు లేదు.., సరైన క్యూలైన్ మేనేజ్మెంట్ లేదు. రెకమెండేషన్ ఉంటే శీఘ్ర దర్శనం లేదా రూ.500లు చెల్లించుకోవాలి. అలా కాదు వివిఐపి దర్శనం కావాలంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కూతురి దయ ఉండాల్సిందే. ఆ కథేందో ఇప్పుడు చూద్దాం.
విశేష పర్వ దినాల్లో సామాన్యుల నుంచి మాన్యుల వరకు వివిధ ఆలయాలను సందర్శిస్తుంటారు. వారి పలుకుబడి తగ్గట్టు వెళ్లే ఆలయాల్లో దర్శనాన్ని చేసుకుంటూ వస్తుంటారు. ప్రత్యేకించి శివరాత్రి నాడు శైవ ఆలయాలకు పోటెత్తుతారు భక్తులు. గ్రహణ కాలంలోనే తెరచి ఉంచే ఏకైక ఆలయమైన శ్రీకాళహస్తీశ్వరుని ఆలయం శివరాత్రి పర్వదినం నాడు దర్శనం కోసం వచ్చే భక్తులతో కిక్కిరిసి పోతోంది. ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించాల్సిన ఈవో, ఏఈవో స్థాయి అధికారులు నామమాత్రంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె బియ్యపు పవిత్ర ఆలయ నిర్వహణ బాధ్యతలు తమ గుపెట్లో పెట్టుకోవడమే ప్రధాన ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
సామాన్య భక్తులకు కిలో మీటర్ల దూరంలో స్వామి అమ్మవార్లను చూపిస్తే.., మాన్యులకు మాత్రం శివయ్య దర్శనం దగ్గరుండి చేయించారు. ఈవో ఉండాల్సిన స్థానంలో ఎమ్మెల్యే కూర్చొని ఎవరు లోపలికి వెళ్లి శివయ్యను దగ్గరగా దర్శించుకోవాలో.., ఎవరు భయటనుంచే వెళ్లి పోవాలో ఆయనే డిసైడ్ చేస్తాడు. అదేంటని ప్రశ్నించిన కొందరిపై తాండవం ఆడాడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇక అమ్మవారి మొదటి గడప నుంచి దర్శించాలంటే ఎమ్మెల్యే కూతురి అనుమతి తప్పనిసరిగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సామాన్య భక్తులకు చుక్కలు చూపించారు అధికారులు. క్యూలైన్ లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మంచి నీరు అందించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు, విఐపిలు, వివిఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండానేఎగ్జిట్ మార్గంలో మాన్యులను ఆలయం లోపలకు తీసుకెళ్లారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Maha Shivaratri 2022, Ysrcp