CRITICISM OVER RTA OFFICIALS HANDED OVER PRIVATE VEHICLE FOR CM CONVOY TRIAL RUN IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT
AP News: సీఎం కాన్వాయ్ కోసం కారు ఎత్తుకెళ్లిన పోలీసులు.. జగన్ రియాక్షన్ ఇదే..!
ప్రతీకాత్మకచిత్రం
Andhra Pradesh: వారంతా ఓ కుటుంబం. అంతా కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో టిఫిన్ చేసేందుకు కారు ఆపగా.. అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లు.. సీఎం కాన్వాయ్ లోకి కారుకావాలంటూ తీసుకెళ్లిపోయారు. దీంతో నడిరోడ్డుపై మహిళలు, చిన్నపిల్లలతో నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది.
వారంతా ఓ కుటుంబం. అంతా కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో టిఫిన్ చేసేందుకు కారు ఆపగా.. అక్కడికి వచ్చిన కానిస్టేబుళ్లు.. సీఎం కాన్వాయ్ లోకి కారుకావాలంటూ తీసుకెళ్లిపోయారు. దీంతో నడిరోడ్డుపై మహిళలు, చిన్నపిల్లలతో నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. శ్రీవారి దర్శనంకు వెళ్తున్న భక్తులపై ఒంగోలు ఆర్టివో అధికారుల ఓవరాక్షన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండకు చేందిన శ్రీనివాసుల కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనార్ధం బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ లో ఇన్నోవా వాహనంను బుక్ చేసుకుని తిరుమలకు బయలుదేరారు. రాత్రి పది గంటల సమయంలో ప్రకాశం జిల్లా (Prakasham District) ఒంగోలు చేరుకున్న వారు టిఫిన్ కోసం వాహనాన్ని ఆపారు.
అదే సమయంలో ఆర్టీవో కార్యాలయంకు చేందిన ఓ కానిస్టేబుల్ కారుతో పాటుగా డ్రైవర్ ను తీసుకెళ్ళాడు. అటుతరువాత మరి కొద్ది సేపటి తరువాత తిరిగి వచ్చిన కానిస్టేబుల్ కారులో నుండి లగేజీ తీసుకోవాలని కారు యాజమాన్యంకు చెప్పామని సీఎం పర్యటన నేపధ్యంలో ట్రైయల్ రన్ కు ఇన్నోవా వాహనం అవసరం ఉందని చెప్పి నడి రోడ్డుపై వదిలేసి కారు తీసుకెళ్ళారు. ఆ సమయంలో మరొక వాహనం దొరక్క శ్రీనివాసుల కుటుంబం నడిరోడ్డుపై మహిళలు, పిల్లలతో పాటుగా సమీపంలోని బస్టాండ్ లో నిరీక్షించాల్సి వచ్చింది.
మరోక వాహనంను బుక్ చేసుకుని తిరుమలకు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఆర్టివో అధికారులపై సీరియస్ అయ్యారు.. ప్రజలను నడి రోడ్డుపై దింపిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సిఎంవో అధికారులను ఆదేశాలు జారీ చేశారు.. ఒంగోలు ఆర్టివో అధికారుల వ్యవహారశైలితో తాము అర్ధరాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని, దీనిపై స్పందించిన సీఎం అధికారులపై చర్యలు చేపట్టడం ద్వారా మరోక సారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని భాధితులు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. విషయం సీఎం జగన్ వరకు వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హోంగార్డు తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ సంధ్యను సస్పెండ్ చేశారు. ఐతే ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు తీసుకెళ్లడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కాన్వాయ్ కోసం వాహనాలు పెట్టుకొలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారన్నారు. మహిళలు, పిల్లలతో వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.