21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు..

ప్రతీకాత్మక చిత్రం

అర్హత లేకపోయినా ఉద్యోగం సాధించిన 21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అర్హత లేకపోయినా నియామక పత్రాలు అందుకున్నట్లు రీ వెరిఫికేషన్‌లో తేలడంతో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది.

  • Share this:
    అర్హత లేకపోయినా ఉద్యోగం సాధించిన 21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అర్హత లేకపోయినా నియామక పత్రాలు అందుకున్నట్లు రీ వెరిఫికేషన్‌లో తేలడంతో ప్రభుత్వం ఈ చర్యలకు దిగింది. అసలేం జరిగిందంటే.. అనంతపురం జిల్లాలో.. పట్టణాల్లో వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుకు నిబంధనల ప్రకారం బీఏ ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ అర్హత ఉండాలి. కానీ కొందరు బీకాం, బీఎస్సీ అర్హతతో పరీక్షలు రాశారు. ఆ తర్వాత వచ్చిన మెరిట్‌ మార్కులతో ప్రాథమికంగా ఎంపికైన వారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అక్కడ కూడా సమస్య లేకుండా ఎంపికయ్యారు. నియామక పత్రాలు దక్కించుకున్నారు. అయితే తమకు డిగ్రీలో బీఎస్సీ, బీకాం అర్హత ఉన్నా నియామక పత్రాలివ్వలేదని, అదే అర్హత ఉన్న కొందరికి మాత్రం ఇచ్చారని కొంతమంది అభ్యర్థులు నగర కమిషనర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

    దీంతో, అసలు కథ మొదలైనట్లు తెలిసింది. సీరియస్‌గా తీసుకున్న జాయింట్ కలెక్టర్, కమిషనర్.. బీఎస్సీ, బీకాం అభ్యర్థులకు నియామకపత్రాలు ఎలా దక్కాయని ఆరా తీశారు. అనంతరం వెంటనే సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్‌ చేయించినట్లు సమాచారం. రీ వెరిఫికేషన్‌లో అర్హత లేని బీఎస్సీ, బీకాం సర్టిఫికెట్లతో మొత్తం 21 మంది నియామకపత్రాలు పొందినట్లు తేలింది. ఈ విషయం వారు కలెక్టర్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు.

    ఈ తతంగంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. సంబంధిత అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సంబంధిత సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేసిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అధికారుల్లో తాడిపత్రి మునిసిపాలిటీలో పనిచేస్తున్న ముగ్గురు, హిందూపురం మునిసిపాలిటీలో పనిచేస్తున్న మరో ముగ్గురు..ఇలా మొత్తం 10మంది అధికారులున్నట్లు తెలిసింది.
    First published: