Home /News /andhra-pradesh /

CPI NARAYANA SLAMS YS JAGAN OVER TIRUPATI MATERNITY HOSPITAL ISSUE UMG

YS Jagan మహిళా ద్రోహి.. తిరుపతిలో ఆస్పత్రి మారిస్తే ఒప్పుకోం.. సీపీఐ నారాయణ ఆగ్రహం

సీపీఐ నారాయణ (Image Source From Facebook)

సీపీఐ నారాయణ (Image Source From Facebook)

  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    సీపీఐ సీనియర్ నేత నారాయణ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడిన నారాయణ.. ఇప్పుడు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. జగన్‌మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అంటూ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు మంత్రి విడదల రజిని, తిరుపతి మేయర్ శిరీషా కూడా మహిళా ద్రోహులే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రసూతి ఆస్పత్రిని.. ఆయన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి తొలగిస్తున్నారంటూ విమర్శించారు. ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని నగర పాలక సంస్థకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. ప్రసూతి వైద్యశాలను తరలిస్తే ఊరుకునేది లేదని.. కేసులకు కూడా భయపడమంటూ నారాయణ తేల్చి చెప్పారు. ప్రసూతి ఆస్పత్రి భవనాలను మారిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేగాకుండా ఆస్పత్రిపై పెట్టిన నగర పాలక సంస్థ బోర్డును తొలగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

    ఇదీ చదవండి: తేళ్లని నాలుకపై పెట్టి పూజలు.. అక్కడ అదే ఆచారం.. ఇంతకీ ఇదెక్కడో తెలుసా..!


    ప్రసూతి ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మహిళలను చించడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఫ్లెక్సీని చించిన మహిళలు దాన్ని తగులబెట్టడంతో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.

    "జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిలా వ్యవహరించడం లేదు. ఆయన రాజకీయం ఇంకేదైనా ఉంటే బయట చూసుకోండి. ఇది వైద్యానికి సంబంధించి. ఇలాంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ తెలియక జరుగుంటే మార్చుకునే ప్రయత్నం చేయండి. లేదూ.. తెలిసే చేసుంటే ముఖ్యమంత్రిని మించిన మహిళా ద్రోహి మరొకరు ఉండరు. ఎందుకంటే ఇక్కడికి వైద్యం కోసం వచ్చేది దారిద్ర్యరేఖకు దిగువగా ఉన్న పేదలు. ఈ ప్రసూతి ఆస్పత్రి భవనం చుట్టూ ఉంది హాస్పిటల్సే. ఇలాంటి ప్రాంతంలో మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా ఎవరికీ మంచిది కాదు. ఇది రోగులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎంతమందైనా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.. కానీ ఈ భవనాన్ని మార్చడానికి మేము ఒప్పుకోము" అని నారాయణ తేల్చి చెప్పారు.



    గతంలోనూ.. సీపీఐ నారాయణ అనేకసార్లు సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దత్తపుత్రుడంటూ జగన్‌మోహన్ రెడ్డి టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సందించారు. మోదీ దయాదాక్షిణ్యాలతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. జగన్‌మోహన్ రెడ్డిని దత్తపుత్రుడు అనడంలో ఎలాంటి సందేహం లేదని నారాయణ ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ అరాచకపాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.
    First published:

    Tags: CPI Narayana, Tirupati, Vidadala Rajani, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు