Home /News /andhra-pradesh /

CPI LEADER NARAYANA MADE SENSATIONAL COMMENTS ON GOVERNOR SYSTEM FULL DETAILS HERE PRN GNT

AP Politics: గవర్నర్లపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు.. హీటెక్కిన రాజకీయం..

సీపీఐ నారాయణ (ఫైల్)

సీపీఐ నారాయణ (ఫైల్)

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించినా ప్రతిపక్షాలు తప్పుబట్టడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ (CPI Narayana) గవర్నర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్(Assembly Budget Session) సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ల ప్రసంగం విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ (Telangana) అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడం, ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించినా ప్రతిపక్షాలు తప్పుబట్టడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సీపీఐ నేత నారాయణ (CPI Narayana) గవర్నర్ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుభవంతో కూడిన వ్యక్తులు గవర్నర్ గా వస్తే ఆ పదవికి గౌరవం చేకూరాలన్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని విమర్శించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రికి హెడ్ క్లర్క్ గా మారారని మండిపడ్డారు.

    ఇక గవర్నర్ వ్వవస్థపైనా నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్ గా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీరి వల్ల వందల కోట్ల ఖర్చు తప్ప ఉపయోగం లేదని.. అసలు ఈ వ్యవస్థే వేస్ట్ అంని కామెంట్ చేశారాయన. ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్ కు తప్ప ఎవరికీ లేదన్న నారాయణ.. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్య చాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరి చేయాల్సింది పోయి ముఖ్యమంత్రి తొత్తులుగా మారారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    ఇది చదవండి: మేకపాటి గౌతమ్ రెడ్డికి అసెంబ్లీ నివాళి.. సీఎం జగన్ కీలక ప్రకటన..


    గవర్నర్ల చర్యల వల్ల ఆ వ్యవస్థపై ఆశ్చర్యం కలుగుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రానికి అనుకూలంగా ఉండేవారిని బాగానే చూసుకుంటున్న గవర్నర్లు.. వ్యతిరేకిస్తున్నవారిని మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇందుకు పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలో ఉదాహరన అని నారాయణ అభిప్రాయపడ్డారు.

    ఇది చదవండి: పవన్ కళ్యాణ్ అభిమానులపై కేసు నమోదు.. కారణం ఇదే..!


    ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున గవర్నర్ ప్రసంగంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు యత్నించడం, ఆ తర్వాత ఆయనపై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. బీఏసీ సమావేశంలో సీఎం జగన్.. టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తాము అవమానించినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తామంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు వయసులో పెద్దవాడైన గవర్నర్ ను అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇది చదవండి: గుడివాడలో వంగవీటి రాజకీయం..? ఆ భేటీ వెనుక కారణం ఇదేనా..?


    తాజాగా సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలోనూ ఆయన పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించే క్రమంలో ఆయన వ్యాఖ్యలు కాస్త ఘాటుగానే ఉంటాయి. బిగ్ బాస్ కార్యక్రమంపైనా గతంలో నారాయణ తనదైన శైలిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, CPI Narayana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు