హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ టీటీడీ ఉద్యోగాల్లో 75శాతం కడప జిల్లాకే.. ప్రజా సంఘాల ఆగ్రహం

ఆ టీటీడీ ఉద్యోగాల్లో 75శాతం కడప జిల్లాకే.. ప్రజా సంఘాల ఆగ్రహం

రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు

రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు

తిరుపతిలో సీపీఐ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడిన నేతలు నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  టీటీడీని మరో వివాదం చుట్టుముట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 47 తోటమాలి ఉద్యోగ నియామకాలలో 75% కడప జిల్లా వాసులకే అంటూ టీటీడీ ఇచ్చిన నోటిఫికేషన్‌పై దుమారం రేగుతోంది. ఈ నోటిఫికేషన్‌ను ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టిటిడి శాశ్వత ఉద్యోగ నియామకాలలో కొత్త సంస్కృతి తీసుకురావద్దని.. టిటిడి ధార్మిక సంస్థను ప్రైవేట్ సంస్థగా మార్చకండని మండిపడ్డారు. తిరుపతిలో సీపీఐ కార్యాలయంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో మాట్లాడిన నేతలు నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  టిటిడి చరిత్రలో శాశ్వత ఉద్యోగ నియామకాల కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. టీటీడీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం గతంలో చేపట్టిన నియామకాల నిబంధనలను అత్యుత్సాహంతో బుట్టదాఖలా చేయడం అన్యాయం. టిటిడి నిబంధనలకు విరుద్ధ. టిటిడి ధార్మిక సంస్థను ప్రైవేట్ సంస్థగా మార్చకండి. టిటిడి శాశ్వత ఉద్యోగ నియామకాలలో కొత్త సంస్కృతి తీసుకురాకండి. చిత్తూరు జిల్లాకు టీటీడీ ఉద్యోగ నియామకాలలో 75% ప్రాధాన్యత కల్పిస్తాం అని ఇటీవల ధర్మకర్తల మండలిలో చేసిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతి తీసుకొని అమలు చేయాలి.
  నరసింహ యాదవ్, తుడ మాజీ చైర్మన్


  టిటిడి ఉద్యోగ నియామకాలలో చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పించే విధంగా జిల్లాలోని అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. టిటిడిలో ఖాళీగా ఉన్న సుమారు 6 వేల ఉద్యోగ నియామకాలలో కూడా చిత్తూరు జిల్లాకు అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు టిటిడిలో ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వేలాది మంది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బందికి టైం స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకుడు రామానాయుడు, ఆర్ పి ఎస్ అధ్యక్షులు అంజయ్య విశ్వనాథ్, వివిధ పార్టీల నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, నరసింహయాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, హేమంత్ కుమార్ యాదవ్, డీఎంసి భాస్కర్ సహా పలువురు పాల్గొన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chittoor, CPI, Tirumala news, Tirumala Temple, Ttd

  ఉత్తమ కథలు