కంటైన్మెంట్ జోన్‌లోకి తిరుమల.. దర్శనం నిలిపేస్తారా?

Tirunala News | శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఏడుకొండలు కంటైన్మెంట్ జోన్ లోకి వెళ్లింది.

news18-telugu
Updated: July 9, 2020, 3:16 PM IST
కంటైన్మెంట్ జోన్‌లోకి తిరుమల.. దర్శనం నిలిపేస్తారా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ఏడుకొండలు కంటైన్మెంట్ జోన్ లోకి వెళ్లింది. ఈ మేరకు జిల్లా అధికారులు తిరుమలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్లడానికి, అందులో నుంచి బయటకు రావడానికి వీలు లేదు. దీన్ని బట్టి తిరుమలలో దర్శనం మళ్లీ నిలిచిపోనుందా? అనే ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంలో టీటీడీ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సుమారు రెండు నెలలకు పైగా శ్రీవారి ఆలయం కూడా మూతపడింది. అనంతరం కేంద్రం సడలింపులు ఇవ్వడంతో భక్తులు సామాజిక దూరం పాటించేలా, శానిటైజేషన్ ఉండేలా ఏర్పాట్లు చేసి అనంతరం దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే, కొన్ని రోజులుగా తిరుమలలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 17 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా సోకిందని బోర్డు అధికారికంగా ప్రకటించింది.

లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చిన తర్వాత రోజుకు 8వేలు, 10వేలు, 12వేలు చొప్పున దర్శనం కల్పిస్తున్నారు. భక్తులకు అందుకు సరిపడా టికెట్లు కేటాయిస్తున్నారు. అలాగే, టీటీడీలో వయసు పైబడిన వారిని విధులకు దూరంగా ఉంచుతున్నారు. 50 సంవత్సరాలు పైబడిన వారిని విధులకు రావొద్దని చెప్పారు. భద్రతా సిబ్బందికి కూడా అదే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక తిరుపతిలో సుమాు 700కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 9, 2020, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading