బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ తమ్ముడికి, అత్తమామలకు షాకిచ్చిన కోర్టు

భార్గవ్ రామ్, అఖిల ప్రియ

అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌కు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్...

 • Share this:
  సికింద్రాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియ సన్నిహితులకు సికింద్రాబాద్ కోర్టులో, బోయిన్‌పల్లి కోర్టులో చుక్కెదురైంది. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ తల్లిదండ్రుల పిటిషన్లను కోర్టు కొట్టేసింది. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌కు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. దీంతో.. సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా అక్కడా నిరాశే ఎదురైంది. భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

  భార్గవ్ రామ్‌తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇటీవలే సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. హఫీజ్‌పేట్‌లో సుమారు 25 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావ్, టీడీపీ నేతలు ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే.. ఐటీ అధికారులమని, పోలీసులమని నమ్మబలికి మొత్తం 15 మంది బోయిన్‌పల్లిలోని ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడ్డారు. ప్రవీణ్‌తో పాటు అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావును వేర్వేరు గదుల్లో నిర్భంధించి ల్యాప్‌టాప్స్, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు.

  ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగ కారు నంబర్లను గుర్తించి లంగర్ హౌస్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్‌లను నిందితులుగా నిర్ధారించిన పోలీసులు అఖిలప్రియను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలులో ఉన్న అఖిల ప్రియ జ్యుడీషియల్ రిమాండ్‌ను ఎదుర్కొన్నారు. ఇటీవలే ఆమె షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు.
  Published by:Sambasiva Reddy
  First published: