హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chittoor: వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సందడిగా సాగిన పెళ్లి.. కానీ వధువరులెవరో తెలిస్తే అవాక్కవుతారు..!

Chittoor: వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో సందడిగా సాగిన పెళ్లి.. కానీ వధువరులెవరో తెలిస్తే అవాక్కవుతారు..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో జరిగిన పెళ్లి మాత్రం చాలా వెరైటీ అని చెప్పుకోవాలి. అక్కడ పెళ్లికూతురు, పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి జరిగింది. వారి స్థానంలో వేపచెట్టు, రావిచెట్టు ఉన్నాయి. అదేంటి చెట్లకు పెళ్లి చేశారంటే మీరు నమ్ముతారా...?

ఇంకా చదవండి ...

  GT Hemanth Kumar, Tirupathi, News18

  పచ్చని పందిళ్లు, అటు ఇటు తిరుగుతూ సందడి చేస్తున్న బంధువులు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు. నడుమ వేడుకగా వివాహ మహోత్సవాన్ని జరుపుకుంటాం. అందంగా అలంకరించిన పెళ్లివేదికపై పెద్దల సమక్షంలో కొత్త జంట ఒక్కటవుతుంది. పెళ్లి తర్వాత అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇదంతా ఏ పెళ్లిలో అయినా జరిగే తంతేగా అనుకుంటున్నారా..? ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో జరిగిన పెళ్లి మాత్రం చాలా వెరైటీ అని చెప్పుకోవాలి. అక్కడ పెళ్లికూతురు, పెళ్లికొడుకు లేకుండానే పెళ్లి జరిగింది. వారి స్థానంలో వేపచెట్టు, రావిచెట్టు ఉన్నాయి. అదేంటి చెట్లకు పెళ్లి చేశారంటే మీరు నమ్ముతారా...? నిజంగానే ఆ రెండు చెట్లకు ఘనంగా పెళ్లి చేశారో దంపతులు. ఏదో చేశామంటే చేశామని.. మమ అనిపించలేదు. మనుషుల వివాహ వేడుక ఎలా జరుగుతుందో అలాగే చేసారు. ఈ వృక్ష వివాహం వెనుకున్న కథ తెలిస్తే అవాక్కవుతారు.

  వివరాల్లోకి వెళితే.... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని బొంతవారి పల్లెలో టక్కొళ్ళ అశ్వత్థనారాయణ, ప్రభావతి నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రావి, వేప చెట్టుకు ఘనంగా వేడుకలు నిర్వహించి పెళ్లి చేశారు. వృక్షాలకు పెళ్లి చేయడంతో... ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. దంపతులిద్దరూ వృక్షాలకు పెళ్లి చేయడం వెనుక పెద్ద కథే దాగి ఉంది. 26 ఏళ్ళ క్రితం నారాయణ., ప్రభావతమ్మ దంపతుల మొదటి కుమారుడు వివాహం జరగకుండానే మృతి చెందాడు. దీంతో ఆ దంపతులు ఊరి పొలిమేరలో ఉన్న నాగ దేవతల ప్రతిమల వద్ద రావి., వేప చెట్లను నాటారు.

  ఇది చదవండి: శివరాత్రి నాడు వివాదాస్పదంగా ఎమ్మెల్యే, ఆయన కుమార్తె తీరు.. ! శివుడి దర్శనంపైనా పెత్తనం..

  అప్పట్లో నాటిన మొక్కలు ఇప్పుడు మహా వృక్షలు అయ్యాయి. పెళ్లి కాకుండా తన మొదటి కుమారుడు చనిపోవడంతో కుటుంబ ఆచారం ప్రకారం వేప రావి చెట్టుకి వివాహం జరిపించారు. తమ కుమారుడు బ్రతికి ఉంటే అచ్చం ఎలా వివాహ వేడుక జరుపుతారో అలానే జరిపారు. ఓ వైపు వేదపండితుని మంత్రోచ్చారణ.., మరోవైపు మగళవాద్యాల నడుమ ఘనంగా వివాహ వేడుక జరిగింది. రావి చెట్టు పురుషుడిగాను., వేపచెట్టు స్త్రీ గా భావించి వివాహం జరిపారు. వేప చెట్లకు చీర, రావి చెట్టుకు పంచె కట్టారు. అమృత ఘడియల్లో వేపచెట్లుకు వేద పండితులు తాళి కట్టి పెళ్లి జరిపించారు. పెళ్లికొచ్చిన సూమారు 200 మంది బంధువులు అక్షతలు చల్లి దీవించారు.

  ఇది చదవండి: అడవిలో ఉంటే వేటాడైనా తినేవేమో..! ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు..! 

  పెళ్లి అనంతరం బంధువులంతా విందు భోజనం ఆరగించారు. అరుదుగా జరిగే ఇలాంటి వివాహాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. తమ కుటుంబంలో పెళ్లి కాకుండా ఎవరైనా మృతి చెందితే వేప, రావి చెట్లకు పెళ్లి జరపడం ఆనవాయితీ అని అశ్వత్థనారాయణ తెలిపారు.

  First published:

  Tags: Andhra Pradesh, Chitoor

  ఉత్తమ కథలు