Cow Baby Shower Function: ఏ కూతురు అయినా తల్లి కాబోంతుందని తెలిస్తే.. ఆమె కన్న తల్లిదండ్రులు పొందే ఆనందం వెలకట్టలేనిది. అంతేకాదు అత్తమామల ఇంటిలో కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. తమ ఇంటికి వారసుడు వస్తున్నాడని మురిసిపోతారు. అందుకే గర్భిణి అయిన మహిళలకు.. అత్తవారిళ్లు లేదా పుట్టింటి దగ్గర వారి సంప్రదాయం ప్రకారం ఘనంగా సీమంతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. సీమంతం (Baby Shower Functions) చేసి ఊరిలో ఉన్న ముత్తయిదువులను పిలిచి ఆడంబరంగా వేడుకను నిర్వహిస్తారు. సాధారణంగా తమ ఆడపిల్లలు గర్భం (Pregnant) దాల్చితే.. ఆమెతల్లి కాబోతుందన్న ఆనందంలో ఎటువంటి అశుభం కలగకూడదని భావించి పెద్దలు సీమంతం జరిపిస్తారు. కన్న కూతురు కాబట్టి అది బాధ్యతగా ఫీలయ్యి తల్లిదండ్రులు అలా సీమంతం చేయండం చాలా కామన్.. కానీ తమ ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా, కూతురుగా భావించి ఒక గోవు (Cow)కు సీమంతం చేసి పెద్ద మనసు చాటుకున్నారు ఆ గోవు యజమానులు. సాధారణంగా హిందువులు గోమాతను దైవంగా భావించి పూజిస్తారు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాల్లో చెప్పారు. అందుకే ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని హిందువులు నమ్మకం. అందుకనే హిందువులు ఆవుని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. చాలామంది మత ఇంట్లో ఆవుని ఎంతో ఇష్టంగా, సొంత ఇంటి పిల్లల్లా భావించి పెంచుకుంటారు.
ఆవులతో పాటు వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు.. వాటికి సీమంతం, పుట్టిన రోజు , నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి పదిమందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. తాజాగా అనంతరపురం జిల్లా (Anantapuram District) లో ఓ కుటుంబం వైభంగా గోమాతకు సీమంతం ఫంక్షన్ చేశారు. ముదిగుబ్బలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఇంటి ఆడబిడ్డలకు నిర్వహించినట్లే గోవుకు సీమంతం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోమాతకు ముత్తైదువుల సమక్షంలో సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. గోవుకి పసుపు కుంకుమలతో పూజలు చేసి.. పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. తమ సంతోషాన్ని పదిమందికి పంచుతూ.. ఏకంగా ఆవు సీమంతం వేడుకల్లో భాగంగా ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Cow Baby Shower Function: ఆవుకు ఘనంగా సీమంతం || 500 మందిని ఆహ్వానించి ఏ... https://t.co/26n7im4EuN via @YouTube #CowboysNation #babyshower @DevinCow @dallascowboys
— nagesh paina (@PainaNagesh) February 13, 2022
గోమాత ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే సీమంతం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ముతైదువులు, మహిళలు గోవుకు చీరసార, పసుపు కుంకుమలు సమర్పించారు. ఇలా ఓ ఆడబిడ్డకు సీమంతం నిర్వహించినట్టుగా హిందూ ధర్మం సాంప్రదాయం ప్రకారం గోవుకు సీమంతం చేయడం సంతోషంగా ఉంది అంటున్నారు ఆ దంపతులు. సీమంతం కార్యక్రమాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.