Home /News /andhra-pradesh /

మండలి రద్దుకు శాసన మండలి నాయకుడి ప్రతిపాదన

మండలి రద్దుకు శాసన మండలి నాయకుడి ప్రతిపాదన

పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఫైల్ ఫోటో)

పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఫైల్ ఫోటో)

సోమవారం లేదా మంగళవారం మండలి రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రభుత్వ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు.

    ఏపీ శాసన మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం మండలిలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించారు. దీనిపై మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన మండలిని రద్దుచేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకపోవగా.. ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డుపడుతోదని విమర్శలు గుప్పించారు. అలాంటి మండలి అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీలో మాట్లాడిన శాసన మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనీ సభ అనవసరమని ఆయన స్పష్టం చేశారు.

    గురువారం అసెంబ్లీలో మంత్రుల ప్రసంగాలు చూస్తుంటే.. మండలి రద్దుకు వడివడిగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వరకూ అసెంబ్లీ సమావేశాలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఐతే రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపధ్యంలో రేపటి నుంచి మూడు రోజులు విరామం ఇచ్చారు. తిరిగి సోమవారం సభ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం మండలి రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో ప్రభుత్వ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ap legislative council, AP News, Pilli Subhash Chandra Bose, Ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు