ఏపీలో సోదాల కలకలం మొదలైంది. తాజాగా రాష్ట్ర ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో, కార్యాలయాలపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. జిల్లాలోని ఖాజీపేటలో గల ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆప్కోలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.
ఈ సోదాల్లో 9 కేజీల 900 గ్రాముల బంగారం, 16 కేజీల 300 గ్రాముల వెండి, రూ. 91,67,000 నగదును సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.10 లక్షల పాత వెయ్యి రూపాయిల నోట్లను, హైదరాబాద్లోని ఇంటిలో మరో రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published by:Krishna Adithya
First published:August 22, 2020, 10:03 IST