దీక్ష విరమించిన చంద్రబాబు...తప్పును సరిద్దుకొని హోదా ప్రకటించాలని కేంద్రానికి డిమాండ్

మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలవనున్నారు చంద్రబాబు నాయుడు. 11 మంది ప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా వెళ్తారు. ఏపీకి ప్రత్యేక హోదా పాటు విభజన హామీలపై కోవింద్‌కు వినతి పత్రం సమర్పించనున్నారు

news18-telugu
Updated: February 11, 2019, 8:30 PM IST
దీక్ష విరమించిన చంద్రబాబు...తప్పును సరిద్దుకొని హోదా ప్రకటించాలని కేంద్రానికి డిమాండ్
చంద్రబాబుకు నిమ్మరసం తాగిస్తున్న దేవెగౌడ
news18-telugu
Updated: February 11, 2019, 8:30 PM IST
ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ధర్మపోరాట దీక్షతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చాటిచెప్పామని ఆయన అన్నారు. మనం ఏకాకులం కాదని.. యావత్ దేశమంతా ఏపీకి అండగా ఉందని చెప్పారు. బీజేపీ అండ్ కో తప్ప..అన్ని పార్టీలూ దీక్షకు సంఘీభావం తెలిపాయన్నారు చంద్రబాబు. మోదీ..దొంగలకు తాళం చెవి ఇచ్చే కాపలాదారు అని విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష ముగిసింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నిమ్మరసం ఇచ్చి చంద్రబాబును దీక్ష విరమింపజేశారు.

ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చాటిచెప్పాం. మోదీ అండ్ కంపెనీ తప్ప అందరూ మద్దతు తెలిపారు. మనం చేసే దీక్ష పవిత్రమైనది. అందుకే యావత్ దేశమంతా మనకు అండగా ఉండగా నిలిచింది. ఆంధ్రులు ఏకాకులు కారని అర్ధమైంది. మోదీ ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి. ప్రత్యేక హోదా సహా మొత్తం 18 డిమాండ్లు నెరవేర్చాలి.హోదాకు సమానమైన నిధులిస్తామంటే ప్యాకేజీకి ఒప్పుకున్నాం. కానీ ఏపీకి కాకుండా వేరే రాష్ట్రాలకు హోదా ఇవ్వడంతో మేమూ హోదాను కోరాం. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘానికి ముడిపెట్టారు. లక్ష కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సి ఉంది. ఆ డిమాండ్లతోనే దీక్ష చేస్తే మీరు జీర్ణించులేకపోతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే మోదీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు. మోదీని మించిన నటుడు దేశంలో ఎవ్వరూ లేరు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. చివరి వరకు పోరాడతాం.
చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం
ఈ సందర్భంగా రఫేల్ డీల్‌ వివాదాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. రాఫెల్ యుద్ధ విమానాల ధరను మూడు రెట్లకు పెంచి..భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఫ్రెంచి అధ్యక్షుడితో ఎలా డీల్ కుదుర్చుతారని..పీఎంవో కార్యాలయం ఉన్నది దళారీ పనులు చేయడానికి కాదని ధ్వజమెత్తారు. సీబీఐ,సీవీసీ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను కూడా దుర్వినియోగం చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు.
దేవెగౌడ ప్రజల మనిషి. మోదీ మాటల మనిషి. సభ ఖర్చులకు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారని అడగడం దారుణం. 2011 సెప్టెంబరు శాంతి సామరస్య ఐకమత్యం కోసం గుజరాత్‌లో మోదీ దీక్షచేశారు. ఆ సభ కోసం రూ.కోటి 67 లక్షలు చేశారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మత కల్లోహాలు సృస్టించింది మీరే. దీక్ష చేసింది మీరే. మీరా మమ్మల్ని తిట్టేది?
చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం
చంద్రబాబు పోరాట యోధుడు. చంద్రబాబు నిబద్ధత, ధైర్యం నాకు తెలుసు. బీజేపీ తప్ప యావత్ దేశమంతా ఏపీకి అండగా ఉంది. మోదీ రాజధర్మం పాటించాలి. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మోదీపై ఉంది.
దేవెగౌడ, మాజీ ప్రధాని


ఏపీ ప్రజలకు విపక్షాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే. గుజరాత్‌లో సర్దార్ పటేల్ విగ్రహానికి మోదీ రూ.3,500 కోట్లు ఖర్చు చేశారని..కానీ అమరావతి నిర్మాణానికి వెయ్యి కోట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. విశాఖపట్నాన్ని రైల్వే జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దానికి చట్టం తేవాల్సిన అవసరం లేదని..జీవో జారీ చేస్తే సరిపోతుందని స్పష్టంచేశారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశం మోదీకి లేదని.. అందుకే కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు ఖర్గే. వారికి తెలిసిందల్లా ప్రజలను వేధించడమేనని విరుచుకుపడ్డారు.కాగా, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ధర్మ పోరాట దీక్ష చేశారు చంద్రబాబు. ఇక మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని కలవనున్నారు. 11 మంది ప్రతినిధులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు పాదయాత్రగా వెళ్తారు. ఏపీకి ప్రత్యేక హోదా పాటు విభజన హామీలపై కోవింద్‌కు వినతి పత్రం సమర్పించనున్నారు.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...