అప్పటి వరకు అంతే.. తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ ప్రకటన

అనాథలు, నిరుపేదలను ఆదుకొనేందుకు టీటీడీ ముందుకొచ్చింది. రోజుకు 50 వేల ఆహార ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా టీటీడీ అందిస్తోంది. మున్సిపల్‌, తుడా సిబ్బంది ద్వారా వీటిని అందించే ఏర్పాటు చేసింది. ఇక ఆలయ పెద్ద జీయర్‌ మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆరిపోలేదు. స్వామివారి కైంకర్యాలు ఆగమ శాస్త్ర పరంగా నిత్యం కొనసాగుతున్నాయి. తిరుమల వెంకన్నకు అర్చకులు నిత్యనైవేద్యాలు అందిస్తున్నారు. శ్రీవారి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలి అన్నారు. కాగా, శ్రీవారి దర్శనాలు రద్దుచేసి నేటికి పదిరోజులు కావడంతో తిరుమల నిర్మానుష్యంగా మారింది.

news18-telugu
Updated: March 30, 2020, 5:39 PM IST
అప్పటి వరకు అంతే.. తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ ప్రకటన
జూలై 28న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్ధంతి.
  • Share this:
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఐదే దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడం, ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో.. దర్శనాల నిలుపుదలను కూడా పొడిగించింది. ఏప్రిల్‌ 14 వరకు దర్శనాల రద్దు కొనసాగుతుందని టీటీడీ వెల్లడించింది. అంతేకాదు తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లను కూడా మూసివేశామమని తెలిపింది. భక్తులకు దర్శనాలను నిలిపివేసినప్పటికీ స్వామి వారికి కైంకర్యాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. అర్చకులు ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ, రాత్రి 8 గంటలకు శ్రీవారికి ఏకాంత సేవ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే వార్షిక వసంతోత్సవాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

మరోవైపు తిరుమలలో భక్తుల దర్శనాలను నిలిపివేయడంతో అనాథలు, బిచ్చగాళ్లు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారిని ఆదుకునేందుకు టీటీటీ ముందుకొచ్చింది. రోజుకు 50వేల ఆహార ప్యాకెట్లను తయారుచేసి ఉచితంగా పంచిపెడుతున్నారు. తుడా, మున్సిపల్ సిబ్బంది వీటిని అందజేస్తున్నారు. పులిహోర, సాంబారు అన్నం, పెరుగన్నం, ఉప్మా, టమోటా రైస్ పొట్లాలను పేదలకు పంపిణీ చేస్తున్నారు. తిరుపతి పరిధిలోని 50 వార్డుల్లో 50 వాహనాల ద్వారా నిత్యం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

First published: March 30, 2020, 5:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading