ఏపీ ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ పరీక్షలు.. కారణమిదే..

అసెంబ్లీ సమావేశాలకు కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. మిగిలిన ఎవ్వరినీ అనుమతించేది లేదని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటికే ప్రకటించారు.

news18-telugu
Updated: June 15, 2020, 8:12 PM IST
ఏపీ ఎమ్మెల్యేలకు కరోనా నిర్ధారణ పరీక్షలు.. కారణమిదే..
వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం బీఏసీ సమావేశం.. తర్వాత వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇదిలావుంటే.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకీ పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం పడింది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిని ఇచ్చారు. మిగిలిన ఎవ్వరినీ అనుమతించేది లేదని అసెంబ్లీ కార్యదర్శి ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ఐబీ అతిథి గృహంలో ఈ మేరకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వైద్యులు కరోనా టెస్టులు చేస్తున్నారు. 175 మంది ఎమ్మెల్యేకు కరోనా పరీక్షలు చేయనున్నారు. వీరిలో ఎంతమందికి పాజిటివ్.. ఎంతమందికి నెగిటివ్ అని తేలుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
Published by: Narsimha Badhini
First published: June 15, 2020, 8:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading