ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ మద్దతు.. విజయం మనదే..

ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, ఫొన్ ఫ్లాష్ లైట్స్ వెలిగించాలని దేశప్రజలను కోరారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని.

news18-telugu
Updated: April 3, 2020, 10:22 PM IST
ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ మద్దతు.. విజయం మనదే..
పవన్ కళ్యాణ్, నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
కరోనాపై పోరాటం నేపథ్యంలో మార్చి 20న జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన మోదీ.. ఇప్పుడు మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి దీపాలు, కొవ్వొత్తులు, ఫొన్ ఫ్లాష్ లైట్స్ వెలిగించాలని దేశప్రజలను కోరారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని. కరోనానను తిప్పికొట్టే సంకల్పాన్ని తీసుకొని.. కరోనా మహమ్మారి చీకట్లను తరిమికొట్టాలని సూచించారు. ఈ క్రమంలో 130 కోట్ల మంది ప్రజల మహా సంకల్పాన్ని చాటుదామని పిలుపునిచ్చారు ప్రధాని.  ఈ కార్యక్రమానికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ట్విటర్ ద్వారా మద్దతు తెలిపారు.


మోదీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వెంటనే ట్విటర్‌లో 9baje9minute (9 గంటలకు 9 నిమిషాలు) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రధాని మాటలను నెటిజన్లు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. చాలా మంది దీనికి సపోర్ట్ చేస్తుంటే.. పలువురు మాత్రం తప్పుబట్టుతున్నారు. వలస కార్మికులు, వైద్య పరికరాలను పట్టించుకోకుండా.. ఇలా మూఢనమ్మకాలను నమ్ముకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఐతే మోదీ లైట్‌ప్ ఇండియా కాన్సెప్ట్‌లో సైన్స్ దాగుందనే అభిప్రాయలూ వ్యక్తమవుతున్నాయి. క్వాంటమ్ సిద్ధాంతం, రిథంభర సిద్ధాంతం ప్రకారం అందరం కలసి ఒక్కటిగా ఆలోచించి, ‘మనకు కరోనా వైరస్ సోకవద్దు’ అని సంకల్పం తీసుకుంటే కలెక్టివ్ కాన్షియస్‌నెస్ దాన్ని అమలు చేస్తుందని ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ చెప్పారు.
First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading