ఏపీలో 149కి చేరిన కేసులు.. కరోనాపై లేటెస్ట్ బులెటిన్ ఇదే

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్‌ సెంటర్ల ఉండగా.. అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: April 2, 2020, 10:34 PM IST
ఏపీలో 149కి చేరిన కేసులు.. కరోనాపై లేటెస్ట్ బులెటిన్ ఇదే
దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి సగటున 556 టెస్టులు చేస్తున్నారు.
  • Share this:
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉదయం బులెటిన్‌లో 21, మధ్యాహ్నం 3, ఇక సాయంత్రం 8 మందికి పాజిటివ్ వచ్చింది. రాత్రి 10 గంటల బులెటిన్‌లో మరో 6 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా ఇవాళ ఒక్క రోజే 38 కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 149కి చేరింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 మందికి కరోనా సోకింది. ఇక కృష్ణా జిల్లాలో 23 మంది, గుంటూరులో 20, కడపలో 18, ప్రకాశంలో 17, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్టణంలో 11, తూర్పు గోదావరిలో 9, చిత్తూరులో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులో ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన వారే ఎక్కువ మంది ఉన్నారు.
పత్రికా ప్రకటన


రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతోంది. ఇప్పటి వరకు నాలుగు టెస్టింగ్‌ సెంటర్ల ఉండగా.. అదనంగా గుంటూరు, కడపలో ఒక్కో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 4 నుంచి అక్కడ కరోనా పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యం రోజుకు 140 నుంచి 570కి పెరగనుంది. ఇక విశాఖపట్టణంలో మరో టెస్టింగ్ సెంటర్ కూడా సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading