గుంటూరులో కరోనా గుబులు.. ఆ 39 మంది కోసం పోలీసుల గాలింపు

145 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఐతే మిగిలిన 39 మంది ఎక్కడున్నారన్నది తెలియాల్సి ఉంది.

news18-telugu
Updated: March 31, 2020, 3:53 PM IST
గుంటూరులో కరోనా గుబులు.. ఆ 39 మంది కోసం పోలీసుల గాలింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ మర్కాజ్ ప్రార్థనలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. నిజాముద్దీన్‌కు వెళ్లొచ్చిన చాలా మందికి కరోనా వైరస్ సోకింది. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన వారిపై ప్రత్యేక దృష్టిపెట్టిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఎవరెవరు వెళ్లారన్న వివరాలను సేకరిస్తున్నారు. ఐతే గుంటూరులో ఏకంగా ఐదు కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం గుంటూరులో 2, మాచర్లలో 2, కారంపూడిలో ఒక కేసు నమోదయ్యాయి. దాంతో గుంటూరులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే ఉన్నారు.

గుంటూరు జిల్లా నుంచి మొత్తం 184 మంది ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటి వరకు 145 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ఐతే మిగిలిన 39 మంది ఎక్కడున్నారన్నది తెలియాల్సి ఉంది. వారి ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. వారి త్వరలోనే ట్రేస్ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ చెప్పారు. ఢిల్లీలో ప్రార్థనలను వెళ్లొచ్చిన వారెవరైనా ఉంటే స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఏపీలో ఇవాళ ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 40కి చేరింది.
Published by: Shiva Kumar Addula
First published: March 31, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading