Home /News /andhra-pradesh /

CORONAVIRUS EFFECT ON TTD DEVASTHANAM TO CONDUCT DHANVANTARI MAHAYAGAM FROM MARCH 19 TO 21ST BA

CoronaVirus | తిరుమలపై కరోనా ఎఫెక్ట్... టీటీడీ సంచలన నిర్ణయం...

లాక్‌డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలకు అనుమతించిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో భక్తులు స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.

లాక్‌డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలకు అనుమతించిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో భక్తులు స్వామిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.

CoronaVirus | మార్చి 19 నుంచి మార్చి 21 తేదీ వరకు తిరుమలలో ధన్వంతరి మహాయాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

    కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్న మీద కూడా పడింది. తిరుమలలో వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర ప్రత్యేక పూజలు తాత్కాలికంగా రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సహస్ర కలశాభిషేకం, ఇతర విశేష పూజలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. క్యూ కాంప్లెక్స్‌లో భక్తులు వేచి ఉంచకుండా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. టోకెన్ విధానంలో గంటకు 4వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం నుంచి టోకెన్ తీసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. మరోవైపు కరోనా నివారణకు ధన్వంతరి యాగం నిర్వహించనున్నారు. మార్చి 19 నుంచి మార్చి 21 తేదీ వరకు తిరుమలలో ధన్వంతరి మహాయాగం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

    అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది.
    కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనంకు వెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వివరాలను వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిది కాదు. దీని వల్ల త్వరగా వైరస్ వ్యాపిస్తుంది. తిరుమలని సెక్టార్ లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపట్టాము. గదులు కాళీ చేసిన వెంటనే పూర్తిగా సుద్ది చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నాము. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు. సీతారాముల కళ్యాణం రద్దు చేసి, లైవ్ ద్వరా కళ్యాణం వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. భక్తులు కూడా సహకరించాలి’ అని తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala tirupati devasthanam

    తదుపరి వార్తలు