న్యూయార్క్‌ టైమ్స్ స్క్వేర్‌లో సీఎం జగన్ ఫొటో.. కరోనాపై కీలక సందేశం

అక్కడి ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌లో సీఎం సందేశాన్ని ప్రదర్శించారు.

news18-telugu
Updated: March 31, 2020, 10:38 PM IST
న్యూయార్క్‌ టైమ్స్ స్క్వేర్‌లో సీఎం జగన్ ఫొటో.. కరోనాపై కీలక సందేశం
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సీఎం జగన్ సందేశం
  • Share this:
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువాళ్లంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సూచించారు. అక్కడి ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్ స్క్వేర్‌లో ఏపీ సీఎం జగన్‌ సందేశాన్ని ప్రదర్శించారు. నార్త్‌ అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పండుగాయల ఈ డిజిటల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ కుటుంబసభ్యుల గురించి కలత చెందవద్దని, ఇక్కడ ప్రభుత్వం వారి పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు సీఎం. కోవిడ్‌ –19 నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ఎక్కడ ఏ చిన్న ఘటన వెలుగులోకొచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ... సమగ్రవైద్య విధానంలో వారికి ఉత్తమమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో తమ వారి కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నార అదే సమయంలో అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని, తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని సీఎం వైయస్‌.జగన్‌ వారిని కోరారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత టైం స్క్వేర్‌లో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సందేశం పట్ల ప్రవాసాంధ్రుల్లో హర్షం వ్యక్తమవుతోందని నార్త్‌ అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పండుగాయల తెలిపారు
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading