ఏపీ లాక్‌డౌన్.. APPSC పరీక్షలు కూడా వాయిదా

ఏప్రిల్‌లో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేశామని APPSC కార్యదర్శి తెలిపారు.

news18-telugu
Updated: March 22, 2020, 8:22 PM IST
ఏపీ లాక్‌డౌన్.. APPSC పరీక్షలు కూడా వాయిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనావైరస్ నేపథ్యంలో ఏపీ లాక్ డౌన్ అయింది. ఈ క్రమంలో APPSC పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా వేశామని APPSC కార్యదర్శి తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి డిగ్రీ కళాశాల లెక్చరర్లు, కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలను సైతం వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అప్పటి వరకు కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలన్నారు. ఒకవేళ వచ్చినా కూడా కనీసం వ్యక్తులకు రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు ప్రజా రవాణా కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం అత్యవసరం అయిన వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు. వాటిలో కూడా ఇద్దరికి మించి తీసుకోవద్దని జగన్ సూచించారు.
Published by: Shiva Kumar Addula
First published: March 22, 2020, 8:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading