తల్లి చనిపోయినా కరోనా విధుల్లో ఏపీ పోలీస్.. వీడియో కాల్‌లో చివరి చూపు

వీడియో కాల్ ద్వారానే తల్లి అంతక్రియలను వీక్షించి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను విధులకు హాజరైతేనే తల్లి ఆత్మ శాంతిస్తుందని చెప్పారు శాంతారామ్.

news18-telugu
Updated: April 1, 2020, 11:04 PM IST
తల్లి చనిపోయినా కరోనా విధుల్లో ఏపీ పోలీస్.. వీడియో కాల్‌లో చివరి చూపు
ఎస్ఐ శాంతారామ్
  • Share this:
'సామాజిక దూరమే మనకు శ్రీరామ రక్ష', 'ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారిని తరమండి.' కరోనాపై పోలీసులు చెబుతున్న మాట. కరోనా దెబ్బకు అందరూ ఇళ్లకు పరిమితమైతే... పోలీసులు మాత్రం మండుటెండల్లో పనిచేస్తున్నారు. రోడ్లపై విధులు నిర్వహిస్తూ ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకు రావొద్దంటూ.. చేతులు జోడించి వేడుకుంటున్నారు. చెబితే వినకుంటేనే లాఠీలకు పనిచెబుతున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, వైరస్ మహమ్మారి తరిమికొట్టేందుకు.. పోలీసులు అంతలా కష్టపడుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. తాజాగా విజయనగరానికి చెందిన ఎస్‌ఐ.. తన తల్లి చనిపోయినా అంత్యక్రియలకు హాజరుకాలేదు. కని, పెంచిన అమ్మ మరణించినా సరే.. ఆ బాధను గుండెల్లో దిగమింగి, కరోనా విధుల్లో పాల్గొన్నారు.

ఈయన పేరు శాంతారామ్. విజయనగం స్వస్థలం. ప్రస్తుతం విజయవాడలో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం శాంతారామ్ తల్లి అనారోగ్యంతో చనిపోయారు. అక్కడికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహిచాలంటే.. 4 జిల్లాలు, 40 చెక్‌పోస్టులు దాటివెళ్లాలి. ప్రస్తుత లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అది అంత ఈజీ కాదు. అంతదూరం వెళ్లితే ఎంతో మందిని కలవాల్సి ఉంటుంది. తద్వారా కరోనా వ్యాప్తి చెందే అస్కారం ఉంటుందనే ఉద్దేశంతో వెళ్లలేదు. సెలవులు ఇచ్చినా ఆయన మాత్రం విజయవాడలోనే ఉండిపోయారు. ఒకవేళ తాను అక్కడికి వెళ్లొచ్చినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని.. అలా జరిగితే విధులకు ఆటంకం కల్గుతుందని చెప్పారు శాంతారామ్. ఈ నేపథ్యంలో తమ్ముడినే అంత్యక్రియలను చేయాలని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అనంతరం వీడియో కాల్ ద్వారానే తల్లి అంతక్రియలను వీక్షించి కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను విధులకు హాజరైతేనే తల్లి ఆత్మ శాంతిస్తుందని చెప్పారు శాంతారామ్. ఈయన స్టోరీ తెలుసుకొని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'హ్యాట్సాఫ్ సార్.. సరిలేరు నీకెవ్వరు' అంటూ సెల్యూట్ చేస్తున్నారు. పోలీసులు మన కోసం ఇంత కష్టపడుతున్నారని.. దయచేసి ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

First published: April 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading