గవర్నర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు సీఎం జగన్.

news18-telugu
Updated: March 30, 2020, 5:07 PM IST
గవర్నర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం
గవర్నర్‌తో జగన్ భేటీ
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం రాష్ట్ర గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు జగన్. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితులను గవర్నర్‌కు వివరించారు. కరోనా నివారణకు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 23 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ.. కరోనా నివారణకు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తూనే ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: March 30, 2020, 5:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading