Home /News /andhra-pradesh /

CORONA VACCINE HEALTH WORKERS GOING TO AGENCY AREA FOR VACCINATION NGS

Corona Vaccine: వ్యాక్సిన్ వేసేందుకు సాహసం.. కొండలు, కోనలు దాటి వెళ్లిన వైద్య సిబ్బంది..

టీకా కోసం సాహసం

టీకా కోసం సాహసం

వ్యాక్సినేషన్ కోసం వైద్య సిబ్బంది చూపిన తెగువ ప్రంశసలు అందుకుంటోంది. నిజంగా వారు చేసిన సాహసం గురించి పూర్తిగా తెలిస్తే ఎవరైనా అభినందించాల్సిందే..

    Corona Vaccine: ఏపీలో కరోనా పూర్తిగా కంట్రోల్ అవుతోంది. అందుకు ప్రధాన కారణం వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతుండడమే.. ఇప్పటికే చాలామంది సెకెండ్ డోస్ వేసుకోగా.. కొందరు ఫస్ట్ వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ పూర్తైనా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కాస్త నత్తనడకనే సాగుతోంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. చాలా ఏజెన్సీ గ్రామాలకు సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో.. అక్కడ వారు బయటకు రాలేకపోతున్నారు. వైద్య సిబ్బంది అక్కడకు వెళ్ల లేకపోతున్నారు. పలు ప్రాంతాల్లో టీకా వేసేందుకు ఆరోగ్య సిబ్బంది గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ టీకా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కరోనాపై అవగాహన బాగానే ఉంది. కొండప్రాంతాల్లో నివసించే వారికి పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే వారికి అవగాహన కల్పించేందు వైద్యసిబ్బంది కృషి చేస్తున్నారు.

    ఇక కరోనా టీకా ఇచ్చేందుకు వైద్య సిబ్బంది కొండలు కోనలు దాటి వెళ్తున్నారు. గత నెలలో హిమాచల్ ప్రదేశ్ లో ప్రవహిస్తున్న నదిలోంచి వెళ్లి టీకా వేశారు వైద్య సిబ్బంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో టీకాలు వేసేందుకు ఆరోగ్య సిబ్బంది కొండలు, కోనలు, వాగులు దాటుకుంటూ వెళ్తున్నారు. విశాఖ జిల్లా రూడకోట మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు.

    వాహన సదూపాయం లేదు.. కనీసం సరిగ్గా నడిచే అవకాశం కూడా లేదు.. వర్షాలు పడడంతో చిన్న రహదారులు బురుదగా మారాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా.. పెద్ద కొండలు ఎక్కుతూ దిగుతూ ఏజెన్సీ ప్రాంతానికి చేరి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ ఆరోగ్య కార్యకర్తలు ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. సాధారణంగా యువకులు కూడా ఎత్తుగా ఉండే కొండలను ఎక్కి దిగడం అనే సాధారణ విషయం కాదు. కేవలం ట్రక్కింగ్ చేసేవారు.. సాహసాలు చేసే వారు మాత్రమే ఇలాంటి ప్రాంతాలకు వెళ్తారు. చేతిలో వ్యాక్సిన్ ను మోసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి.. తిరిగి అదే మార్గంలో ఇంటికి వచ్చారు. నిజంగా వారు చూపించిన తెగువ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Corona Vaccine, Covid vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు