హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు నేడు పరిహారం... సీఎం జగన్ ఆదేశాలు

విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు నేడు పరిహారం... సీఎం జగన్ ఆదేశాలు

విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు నేడు పరిహారం... సీఎం జగన్ ఆదేశాలు (File)

విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు నేడు పరిహారం... సీఎం జగన్ ఆదేశాలు (File)

Corona Lockdown | Corona Update : విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాద బాధితులకు వెంటనే పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

  Corona Lockdown | Corona Update : విశాఖ జిల్లాలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ గ్యాస్ లీకేజీ ప్రమాదంలో... బాధితులకు... అధికారులు ఇవాళ పరిహారం అందించబోతున్నారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి... ఆదివారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఆదివారమే మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఐతే... అధికారులు... నిన్న కొంత మందికి పరిహారం ఇచ్చినట్లు తెలిసింది. ఇవాళ పూర్తిస్థాయిలో అందరికీ పరిహారం ఇచ్చేలా ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది. అందులో భాగంగా... మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. అలాగే... ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి వారి పరిస్థితిని బట్టీ ఎంత పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం లెక్క గట్టిందో... అంత ఇవ్వనున్నారు.

  ఇంతకు ముందు సీఎం జగన్... మృతుల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పును ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25 లక్షలు ఇస్తామన్నారు. ఆస్పత్రుల్లో రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష ఇస్తామన్నారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. ఇదే ప్రకారం అధికారులు ఇవాళ పరిహారం ఇవ్వనున్నారు.

  విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై జగన్‌ తన ఇంట్లో సమీక్షించారు. కంపెనీలో గ్యాస్‌ లీక్‌ను ఆపడానికి ఏం చేశారో తెలుసుకున్నారు. గాల్లో గ్యాస్‌ చాలా వరకూ తగ్గిపోయిందనీ, ఇక డేంజర్ లేదని అధికారులు సీఎంకి చెప్పారు. అయినా సరే... పరిసర గ్రామాల్లో ఫుల్లుగా శానిటేషన్‌ చెయ్యాలని సీఎం ఆదేశించారు. అన్ని చర్యలు తీసుకున్నాకే స్థానికుల్ని తమ తమ గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతించాలని జగన్ ఆర్డరేశారు. అధికారులు "సరే సార్" అన్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Coronavirus, Covid-19, Lg polymers, Visakhapatnam

  ఉత్తమ కథలు