Andhra Pradesh: అర్ధరాత్రి 11.45 గంటలకు బాత్రూంలోకి వెళ్లిన కరోనా పేషెంట్.. ఎంతకూ తిరిగి రావడం లేదేంటా అని అనుమానంతో వెళ్లి చూస్తే..

కొవిడ్ ఆస్పత్రి నుంచి పరారైన విజయ్ (ఫైల్ ఫొటో)

గురువారం అర్ధరాత్రి 11.45 నిమిషాల సమయంలో మూత్ర విజర్జన కోసమని ఓ కరోనా పేషెంట్ బాత్రూంలోకి వెళ్లాడు. అయితే బాత్రూంకని వెళ్లిన అతడు ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో ఏమయి ఉంటుందా అని బయట ఉన్న వాళ్లు వెళ్లి చూస్తే..

  • Share this:
    కరోనా. ఇప్పుడు ఈ పదమే ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్ అంతటా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాల్లోనూ కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఇంతటి కరోనాలోనూ నేరాల సంఖ్య మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. పెను విపత్తును కూడా నేరగాళ్లు అవకాశంగా మలచుకుంటున్నారు. తమ నేరాలకు తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్ అని ముందే తేలింది. దీంతో అతడిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. చక్కగా ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన అతడిలో ఓ ఆలోచన మెదిలింది. ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. అందరిలోనూ భయాందోళనలను రేకెత్తిస్తున్నాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా ఒంగోలు హిల్ కాలనీలో ఇటీవల ఓ హత్య జరిగింది. ఈ హత్య కేసునకు సంబంధించి ఏప్రిల్ 19వ తారీఖున టంగుటూరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరిస్తే రిమాండ్ కూడా విధించారు. అయితే ఆ సమయంలో చేసిన టెస్టుల్లో నిందుతులైన పులి శ్రీనివాసులు, జంగిపల్లి విజయ్ కు కరోనా అని తేలింది. దీంతో వారిద్దరినీ ఒంగోలు జీజీహెచ్ కు తరలించారు. ఆ ఆస్పత్రిలో రెండో అంతస్తులో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న విజయ్ లో ఓ పాడు ఆలోచన మెదిలింది. అంతే, అస్సలు ఆలస్యంచేయలేదు.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    గురువారం అర్ధరాత్రి 11.45 నిమిషాల సమయంలో మూత్ర విజర్జన కోసం అని బాత్రూంలోకి వెళ్లాడు. అయితే బాత్రూంకు అని వెళ్లిన అతడు ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో ఏమయి ఉంటుందా అని బయట కాపలాగా ఉన్న పోలీసులు లోపలకు వెళ్లిచూశారు. బాత్రూంలో విజయ్ కనిపించలేదు. బాత్రూం గది కిటికీలు వంచి బయటివైపు గోడకు ఆనుకుని ఉన్న చెట్లపై నుంచి కిందకు దూకి పారిపోయినట్టు గుర్తించారు. దీనిపై ఒంగోలు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుచేశారు. నిందితుడు విజయ్ ది గుంటూరు జిల్లా యార్లగడ్డ కావడంతో అక్కడకు వెళ్తాడేమోన్న అనుమానంతో అక్కడి పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.
    Published by:Hasaan Kandula
    First published: