Home /News /andhra-pradesh /

CORONA CASES INCREASING IN ANDHRA PRADESH DOUBTS RAISED ABOUT APSRTC SERVICES FULL DETAILS HERE HSN

Andhra Pradesh: ఏపీలో కరోనా విజృంభణ.. ఆర్టీసీ బస్సులు నడుస్తాయా..? APSRTC సమావేశంలో ఎండీ కీలక వ్యాఖ్యలు..!

ఏపీఎస్ఆర్టీసీ బస్సులు (ప్రతీకాత్మక చిత్రం)

ఏపీఎస్ఆర్టీసీ బస్సులు (ప్రతీకాత్మక చిత్రం)

గతేడాది విజృంభించినట్టుగానే ఈ ఏడాది కూడా ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో గతంలోలాగానే ఈసారి కూడా బస్సు సర్వీసులను నిలిపివేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

    ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తారస్థాయిని చేరుకుంటోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు స్కూళ్లను బంద్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొన్ని కాలేజీల్లో కరోనా కేసులు రావడంతో తాత్కాలికంగా సెలవులు ఇస్తూ ఆయా కాలేజీల యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సామూహికంగా జనాలు మసలుతున్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పలు నగరాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు విధిస్తూ కరోనా కట్టడికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సుల సర్వీసుల విషయంలో కూడా అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది నెలకొన్న పరిస్థితులే ఈ సారి కూడా ఉత్పన్నమవుతుండటంతో బస్సు సర్వీసులను నిలిపివేస్తారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కరోనా కేసుల రీత్యా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ అన్ని జిల్లాల ప్రాంతీయ మేనేజర్లు, ఈడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని బస్సులు, బస్టాండ్లలో శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడం, అందరూ మాస్కులు ధరించేలా అవగాహన కల్పించడం చేయాలని సూచించారు. బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ తో శానిటైజేషన్ జరిగేలా చూడాలన్నారు. బస్సుల్లో ఎవరైనా మాస్కులు లేకుండా కనిపిస్తే అక్కడికక్కడే వారికి మాస్కులు అందజేయాలన్నారు. అవసమైన చోట్ల బస్సు సర్వీసులను పెంచడమో, కుదించడం గురించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే బస్సు సర్వీసుల సంఖ్యను కుదించాల్సి కూడా రావచ్చన్నారు.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    కాగా, ప్రస్తుతానికి బస్సు సర్వీసులను నిలిపివేసే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా ఆర్పీ ఠాకూర్ కీలక విషయాలు వెల్లడించారు. 45 ఏళ్లు దాటిన ప్రతీ ఉద్యోగి వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి కొవిడ్ బారిన పడితే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తామని ప్రకటించారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Andhra Pradesh, Apsrtc, Corona cases, Corona negative, Corona Possitive, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు