CONTROVERSY OVER ANNAMAYYA DISTRICT AS RAYACHOTI CHOOSEN AS HEAD QUARTER OF THE DISTRICT THAN RAJAMPETA FULL DETAILS HERE PRN
AP Districts Controversy: ఏపీలోని ఆ కొత్త జిల్లాపై రచ్చ.. రాజీనామాకు సిద్ధమైన వైసీపీ నేత..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలను (AP New Districts) ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలుగా నోటిఫికేషన్ జారీ చేసి ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాలను (AP New Districts) ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలుగా నోటిఫికేషన్ జారీ చేసి ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో భౌగోళిక, ప్రాంతీయ, సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఐతే కొత్త జిల్లాల అంశం అక్కడక్కడా వివాదాస్పదం అవుతోంది. జిల్లాల పేర్లు, హెడ్ క్వార్టర్స్ పై విమర్శలొస్తున్నాయి. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలకు బదులు వైసీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలోనే వివాదం రేగింది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ కొత్త జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరుపెట్టగా.. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం పేర్కొంది.
ఐతే అన్నమయ్య జిల్లా కేంద్రంపై రాజంపేట వైసీపీ నేతలే అభ్యంతరం చెబుతున్నారు. రాజంపేట ప్రజలను సంప్రదించకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా ప్రకటిస్తారంటూ రాజంపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్ మర్రి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియోని కూడా విడుదల చేశారు.
అన్నమయ్య పేరును ఆయన పుట్టిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి పెట్టారని.. రాయచోటిని మదనపల్లిలో కలిపి మరో జిల్లా ఏర్పాటు చేసుకోవాలని మర్రి రవి అన్నారు. అంతకాదు. రాజంపేట ప్రజలను అనాథల్లా రాయచోటిలో కలిపారని.. ఇలా చేస్తే తాము ప్రజల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదన్నారు. అంతేకాదు ప్రభుత్వం ఇలాగే ముందుకెళ్తే రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. రాజంపేటను కడప జిల్లాలో అయినా ఉంచాలి లేదంటే రాజంపేటను జిల్లా కేంద్రంగా అయినా ప్రకటించాలని మర్రి రవి డిమాండ్ చేశారు. మరోవైపు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై రాజంపేట టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. అన్నమయ్య జన్మించిన రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజంపేట ఎమ్మెల్యే సహా ఎంపీ, జెడ్పీ ఛైర్మన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లా మదనపల్లిని కూడా ప్రత్యేక జిల్లాగా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మదనపల్లిని జిల్లాగా చేయాలని ఎన్నో ఏళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మదనపల్లిని రాజంపేటలో కలపడం సరికాదని స్థానిక నేతలు విమర్శిస్తున్నారు. ప్రభత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నందున ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.