GT Hemanth Kumar, Tirupathi, News18
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని (Lord Venkateswara Swamy) సన్నిధిలో హనుమంతుడు (Lord Hanuman) జన్మించాడని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ధారించింది. ఐతే ఇప్పుడీ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇందుకోసం పండిట్ పరిషత్ కమిటీని ఏర్పాటు చేసి.. పౌరాణిక, భౌగోళిక, శాస్త్రీయ ఆధారాలు సేకరించిన పండిత్ పరిషత్ కమిటీ.., తిరుమలలో హనుమంతుడు జన్మించాడని నిర్ధారించింది. గతేడాది ఏప్రిల్ 21వ తేదీ తిరుమలలోని ఆకాశగంగ తీర్థంలో హనుమంతుడు జన్మించడాని అధికారికంగా ప్రకటించారు పండిథ్ పరిషత్ కమిటీ సభ్యులతో కలిసి టీటీడీ అధికారులు. తిరుమలలో హనుమంతుడు పుట్టడాని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉన్నాయని టీటీడీ స్పష్టం చేస్తోంది. రామాయణ,మహా భారత, ఇతర ఇతిసహాతో పాటు టీటీడీ అత్యంత ప్రామాణికంగా తీసుకొనే వెంకటాచల మహత్యంలోనూ తిరుమలే హనుమ జన్మస్థాలం లిఖించబడ్డాయి. దీంతో ఆకాశ గంగ తీర్థంలో అభివృద్ధి పనులు, హనుమ ఆలయ నిర్మణానికి పూజ నిర్వహించనుంది.
ముందునుంచి తిరుమల హనుమ జన్మస్థలంగా నిర్ధారించడాన్ని వ్యతిరేకిస్తున్నారు హనుమ జన్మస్థలం తీర్థ ట్రస్ట్ పీఠాధిపతి గోవిందానంద సరస్వతి. టీటీడీ చెప్పేదంతా అబద్ధమని ఆక్షేపిస్తున్నారు. హనుమ జన్మస్థలం హంపీ క్షేత్రమని అంటున్నారాయ. టీటీడీ బహిరంగ చర్చలకు వస్తే తమ వద్ద ఉన్న ఆధారాలతో హనుమ జన్మస్థలం హంపీ క్షేత్రంగా రుజువుచేస్తామని చెబుతున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతులు హంపి అని నిర్ధారిస్తునట్లు చెప్పారు. తిరుమలలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తులను టిటిడి మోసం చేస్తోందన్నారు.
అయితే గోవిందానంద సరస్వతిపై ఆరోపణలు చేస్తోంది టీటీడీ. గోవిందానంద వద్ద ఎలాంటి అధరాలు లేవని స్వలాభం కోసమే వివాదంగా మారుస్తున్నారని చెప్తున్నారు. టీటీడీని వంద ఎకరాల భూమి, కొంత నగదు కోరినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సైతం గోవిందానంద సమాధానం ఇవ్వలేకపోయారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ వివాదం కాస్త కోర్టు మెట్లు ఎక్కింది.
ఇది చదవండి: వైజాగ్ లో మరో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.., చూస్తే వదిలిపెట్టరు..
తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా ఏడు కొండల్లో ఒకటైన అంజనాద్రిపై హనుమంతుడు జన్మించారని పేర్కొంటూ అక్కడ దేవాలయం నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందని, దానిని నిలువరించాలని కోరుతూ కర్నూలుకు చెందిన రాఘవేంద్ర మరో ఇద్దరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది కొప్పినీడి రాంబాబు వాదనలు వినిపించారు. అంజనాద్రిపై సుందరీకరణ పనులు మినహా దేవాలయం, ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆకాశగంగలో సుందరీకరణ పనులకు భూమిపూజ చేసుకోవచ్చని చెప్పింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ ప్రతివాదులుగా ఉన్న దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవోకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.