Home /News /andhra-pradesh /

Republic Movie Controversy: సాయితేజ్ రిపబ్లిక్ సినిమాపై వివాదం.., కోర్టుకు వెళ్తామని హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..!

Republic Movie Controversy: సాయితేజ్ రిపబ్లిక్ సినిమాపై వివాదం.., కోర్టుకు వెళ్తామని హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..!

Sai Dharam Tej in Republic Photo : Twitter

Sai Dharam Tej in Republic Photo : Twitter

ఇప్పటికే టాలీవుడ్ (Tollywood)లో చాలా సినిమాలపై వివాదాలు రేగాయి. ఇటీవలే ఉప్పెన (Uppena) ఫేమ్ వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన కొండపొలం (Kondapolam)పై (Kondapolam) కాంట్రవర్సీ మొదలైంది. తాజాగా దేవకట్ట (Deva Katta) దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ (Sai Tej) హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా (Republic Movie) వివాదాస్పదమవుతోంది.

ఇంకా చదవండి ...
  సినిమాలపై వివాదాలు (Movie Controversy) రేగడం సాధారణమే. రిలీజ్ అయిన, రిలీజ్ కాబోతున్న సినిమాలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ లుగా మారుతుంటాయి. ఇప్పటికే టాలీవుడ్ (Tollywood)లో చాలా సినిమాలపై వివాదాలు రేగాయి. ఇటీవలే ఉప్పెన (Uppena) ఫేమ్ వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించిన కొండపొలం (Kondapolam Movie)పై కాంట్రవర్సీ మొదలైంది. తాజాగా దేవకట్ట (Deva Katta) దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ (Sai Tej) హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా (Republic Movie) వివాదాస్పదమవుతోంది. ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొల్లేరు (Kolleru Lake) ప్రాంత వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సినిమాలో తమ మనోభావాలను కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ ఆరోపిస్తున్నారు. రిపబ్లిక్ సినిమాలోని సన్నివేశాలు తమ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని.. వెంటనే సదరు సన్నివేశాలను తొలగించాలని అక్కడివారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు.

  కొల్లేరు ప్రజల జీవనస్థితిగతులకు వ్యతిరేకంగా సినిమా తీశారని.. తామంతా కొల్లేరుపై ఆధారపడి జీవిస్తుంటే.. అక్కడి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా సన్నివేశాలున్నాయని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. విషపూరిత రసాయనాలతో చేపలు సాగుచేస్తున్నట్లు చూపించారని.. దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని మండిపడ్డారు. సినిమా యూనిట్ పై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదుచేశారు. సినిమా యూనిట్ వెంటనే స్పందించి కొల్లేరుపై చిత్రీకరించిన సన్నేవేశాలు తొలగించాలని లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎలాంటి అధారాలతో దేవకట్ట ఈ సినిమా తీశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  ఇది చదవండి: రోజా కుమార్తె అన్షుకి అరుదైన గౌరవం.... తల్లికి తగ్గ తనయ అనిపించుకుందిగా..


  ఈ సినిమాలో సాయి తేజ్... పంజా అభిరామ్ అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటించారు. సాయితేజ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది. రమ్య కృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 1న విడుదలై రిపబ్లిక్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

  ‘కొండపొలం’పై వివాదం
  ఇక సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం మూవీ.. వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలో హీరో పేరులో యాదవ్‏ను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి. కురుమ/కురువల కులవృత్తి నేపథ్యంలో సినిమా తీసి యాదవ్ అని ఎలా పెడతారని కురవ సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో పాలమూరు కురవ సంఘం సినిమాలో హీరో పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

  '' కొండపొలం సినిమాలో మా కురుమ/ కురువ కులవృత్తి ఎదుర్కొంటున్న సమస్యలను బాగా చూపించారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమాలో హీరో పేరు కటారు రవీంద్ర యాదవ్ అని పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యాదవులు అంటే గొర్రెలు, మేకలు కాకుండా గేదెలు, ఇతర పశువులు కాస్తారు. కురుమ, కురువలు మాత్రమే గొర్రెలు కాస్తారు. యాదవులు BC-Dలో కేటగిరీలలో ఉంటే, కురుమలు ఇంకా వెనకబడిన వర్గానికి చెంది BC-B కిందకు వస్తారు. మా పేరు చివర కురుమ అని పెట్టుకుంటాం. యాదవుల కుల దైవం మల్లన్న. కురుమల కుల దైవం బీరప్ప. కోటి మంది కురుమల మనోభావాలను దెబ్బతీసినట్లు హీరో పేరు ఉంది. ఒక సామాజిక వర్గం అస్తిత్వాన్ని ప్రశ్నించేలా ఉంది. హీరో పేరును మార్చాలి. యాదవ్ అనే పదాన్ని తొలగించినా మాకు అభ్యంతరం లేదు. పేరు మార్చకుండా సినిమా విడుదల చేస్తే మా నిరసన తెలియజేస్తాం. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేస్తాం.'' అని శంకరోళ్ల రవి కుమార్ తెలిపారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Republic Movie, Tollywood, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు