హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kanipakam: కాణిపాకం ఆలయంలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా? ఉన్నతాధికారులు కఠినంగా ఉంటే ఏం జరుగుతుంది?

Kanipakam: కాణిపాకం ఆలయంలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా? ఉన్నతాధికారులు కఠినంగా ఉంటే ఏం జరుగుతుంది?

కాణిపాకం ఆలయం

కాణిపాకం ఆలయం

Kanipakam: ప్రముఖ పుణ్యక్షేత్రం.. స్వయంభుగా వెలిసిన వరసిద్ధి వినాయకుడు సన్నిధానంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఎదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది. అయితే ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతుండడంతో.. అక్కడి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా..? లేద ఎప్పటిలాగే చూసి చూడనట్టు వదిలేస్తారా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

Kanipakam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం (Kanipakam) ఒకటి.. స్వయంభుగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి (Varasiddhi Vinayaka Swamy Temple) వారి దేవస్థానం ప్రస్తుతం వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ముఖ్యంగా ఆలయ పునర్నిర్మానం తర్వాత ఆగస్టు 21 నుంచి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆలయ అర్చకులు కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల కారణంగా.. ఆలయంలో అధికారులు అంతర్గత బదిలీలకు అవకాశం ఉందా, ఉంటే అధికారుల వరకు అంతర్గత బదిలీలు జరిగేనా? లేకపోతే ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందిని సైతం మార్చే అవకాశం ఉందా? గతంలో ఉన్న ఈవో అంతర్గత బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానిని కొంతమంది అడ్డుకోవడంతో ఆగిపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

వినాయక స్వామివారి మూలవిరాట్ కు నిత్యం పూజలు చేసే అర్చకుల సైతం కొంత కొరత ఉందని, అలాంటి సమయంలో కొంతమంది అర్చకులకు అంతరాలయంలోని మూలవిరాట్టుకు పూజలు చేయడానికి ఆలయంలో పని చేస్తున్న ఇంకొంతమంది అర్చకులను తీసుకొని, అంత్రాలయంలోమూల విరాట్ కు స్వామివారి కైంకర్యాలకు అర్చకుల ను తీసుకొని ప్రక్షాళన దిశగా అడుగులు వేసే అవకాశం ఉందా? గతంలో ఉన్న ఆలయ ఈవో ప్రక్షాళన దిశగా ఈ ప్రణాళికను రూపొందించడానికి అన్ని విధాల ఏర్పాటు చేశారని ఇంతలో వారికి ట్రాన్సఫర్ కావడంతో అంతర్గత బదిలీలు ఆగిపోయాయి.

 పాలక మండలి సభ్యులు ఆలయ ఈవో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ? ఇంత జరిగిన తరువాత ప్రక్షాళన జరగకపోతే, భక్తులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం లేక పోలేదు. గతంలో స్వామివారి ఆలయంలో మూల విరాట్ కు పూజలు నిర్వహించేందుకు, ఆలయంలో అర్చకులు కొరత ఉందని.. కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ లోని దేవాదాయ శాఖకు తెలిపారు. తరువాత కమిషనర్ ఆదేశాల మేరకు కాణిపాక దేవస్థానానికి నలుగురు అర్చకులను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి : ఐటీ దాడులు.. ఈడీ నోటీసులు.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతోంది..?

వారందరినీ కాణిపాకం దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారి కి వెళ్లి రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ నలుగురు అర్చకులు కాణిపాక దేవస్థానంలో విధులలో చేరి సుమారు ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆలయ అధికారులు వారికి ఇప్పటి వరకు స్వామివారి మూలవిరాట్ పూజలు చేసే అవకాశం కల్పించకపోవడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో ఉన్న ఆలయ ఈవో, రాణా ప్రతాప్ దృష్టికి షోడశ గణపతి వద్ద ఉన్న ఆ నలుగురు అర్చకులు నిత్యం అక్కడే పూజలు నిర్వహించడంతో అనుమానం వచ్చిన ఆయన వీరికి ఎందుకు ఆంతరాలయంలో స్వామివారి సేవకు ఎందుకు వినియోగించు కోవడం లేదని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి : రేపు సీఎం జగన్ ఎన్నికల సమర శంఖం.. జయహో బీసీకి భారీ ఏర్పాట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే

కమిషనర్ ఆదేశాలతో వచ్చిన వారికి ఆంతరాలయం షోడశ గణపతిలో అన్నిచోట్ల డ్యూటీలు, రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించేలాగా ఒక ప్రణాళిక రూపొందించారు. ఇంతలో కార్యనిర్వాహణాధికారి బదిలీపై వెళ్లిపోవడంతో, కొత్తగా వచ్చిన ఆలయ ఈవో వెంకటేష్ రొటేషన్ పద్ధతి గురించి అడిగి తెలుసుకున్నారు. గతం నుంచి ఇప్పటివరకు రొటేషన్ పద్ధతి గురించి అధికారులు మాట్లాడుకోవడం తప్ప.. ఆచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నారు. పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు చొరవ తీసుకొని అర్చకులు అందరికీ రొటేషన్ పద్ధతిలో స్వామివారి మూలవిరాట్ కు పూజలు చేసే అవకాశం ఎందుకు కల్పించడం లేదు. విచిత్రం ఏంటంటే ఆలయంలో పదిమంది అర్చకులు ఉన్నారు, వారిలో ఐదు మంది మాత్రమే ఆంతరాలయం పూజలు నిర్వహిస్తున్నారు. మిగతా ఐదు మందికి ఎందుకు ఆంతరాలయం డ్యూటీ ఇవ్వడం లేదని, ఆ 5 మంది అర్చకులకు ఆంతరాలయంలో డ్యూటీ వేయకుండా అడ్డుకొంటున్నది ఎవరు? అందులో ఒక స్వామివారు గతంలో నుంచి ఇప్పటి వరకు అద్దాల మండపం, స్వామివారి కల్యాణోత్సవం, ఈ రెండిటి దగ్గర డ్యూటీలో నిర్వహించేవారు.

ఇదీ చదవండి : మీడియాలో యాంకర్ గా కూడా పనికిరావ్.. వైసీపీ ఎంపీవైతే చంద్రబాబుతో పనేంటి..?

కమిషనర్ ఆదేశాలతో వచ్చిన మిగతా నలుగురు షోడషగణపతి దగ్గర సుమారు ఏడు సంవత్సరాలుగా నిధులు నిర్వహిస్తున్నారు. వీళ్లు ఐదు మందికి ఎందుకు ఆంతరాలయం పూజలు నిర్వహించే అవకాశం కల్పించలేకపోతున్నారు. ఐదుమంది పేరుకే దేవస్థానం అర్చకులు, కొంతమంది అర్చకులు అధికారులు చేతుల్లో పెట్టుకొని ఆంతరాలయం డ్యూటీ ఇవ్వడం లేదు అని ఆరోపణలు వెల్లువెత్తాయి.. ఇప్పటికైనా పాలకమండలి సభ్యులు ఆలయ అధికారులు చొరవ తీసుకొని అందరూ అర్చకులకు రొటేషన్ పద్ధతిలో స్వామివారి మూల విరాట్ కు పూజలు చేసే అవకాశం కల్పిస్తారా.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chittoor, Hindu Temples

ఉత్తమ కథలు